జాతీయ పార్టీలకు కాలం చెల్లిందా ? మరి బీఆర్ఎస్ ఏ పార్టీ ? 

ఒక్కోసారి బీఆర్ఎస్( BRS ) అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) ఏం మాట్లాడుతారో .

ఎందుకు మాట్లాడుతారో ఎవరికి అర్థం కాదు.తన మనసులోని మాటను వెనుకా ముందు ఆలోచించకుండా మాట్లాడేస్తూ ఉంటారు.

తమ రాజకీయ ప్రత్యర్థులను ఇరుకును పెట్టేందుకు కెసిఆర్ అనేక సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు.

  ఒక్కోసారి ఆ వ్యాఖ్యలు కెసిఆర్ లో ఉన్న గందరగోళాన్ని బయటపెడుతూ ఉంటాయి.

  ఇదేవిధంగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ టంగ్ స్లిప్ అయ్యారు.నిజామాబాద్ మెదక్ బోధ్  బహిరంగ సభల్లో మాట్లాడిన కేసీఆర్ కాంగ్రెస్,  బిజెపిలను ఉద్దేశించి జాతీయ పార్టీలకు కాలం చెల్లిందని , రాబోయే భవిష్యత్తు అంతా ప్రాంతీయ పార్టీలదేనని అన్నారు.

  త్వరలో జరగబోతున్న లోక్ సభ ఎన్నికల తరువాత జాతీయ పార్టీలే చక్రం తిప్పుతాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

"""/" / బిజెపి ,కాంగ్రెస్ ( BJP, Congress )లను ఇరుకును పెట్టేందుకు కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినా,  టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ గా మార్చి జాతీయ పార్టీగా మార్చిన కేసీఆర్ మహారాష్ట్ర,  కర్ణాటక, ఏపీ తో పాటు అనేక రాష్ట్రాల్లో బీ ఆర్ ఎస్ ను బలోపేతం చేసి అక్కడ కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చేలా చేయాలని భావించారు .

దీనికి తగ్గట్లుగానే మహారాష్ట్రలోనూ అనేకసార్లు భారీ బహిరంగ సభలు నిర్వహించారు.  అక్కడి నాయకులను పార్టీలో చేర్చుకున్నారు .

మహారాష్ట్ర లో పార్టీ విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్పిన కెసిఆర్ దానికి తగ్గట్లుగానే అనేకసార్లు మహారాష్ట్రలోనూ పర్యటించారు.

"""/" / జాతీయ పార్టీగా బి.ఆర్.

ఎస్ తో జాతీయ రాజకీయాల్లో సంచలన మార్పులు తీసుకొస్తానని , బిజెపి , కాంగ్రెస్ లను వివిధ రాష్ట్రాల్లో బలోపేతం చేసి కేంద్రంలో అధికారంలోకి వస్తామని ధీమా గా చెప్పారు .

అయితే ఇప్పుడు కేసీఆర్ జాతీయ పార్టీల పని అయిపోయిందని,  ప్రాంతీయ పార్టీలదే హవా అంటూ మాట్లాడిన మాటలు ఉద్దేశపూర్వకంగా చేశారా లేక మరేదైనా కారణం ఉందా అనేది అంతు పట్టడం లేదు.

వీడియో: పురాతన నిధికి కాపలాగా భయంకర జీవులు.. అదే ఆశ్చర్యకరం..