నేషనల్ ఎడ్యుకేషన్ డే సెమినార్

నల్లగొండ జిల్లా:మౌలానా అబుల్ కలాం పుట్టినరోజు సందర్భంగా యునైటెడ్ ముస్లిం మైనారిటీ రైట్స్ ఆర్గనైజేషన్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ నజీర్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓ భవనంలో నేషనల్ ఎడ్యుకేషన్ డే సెమినార్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కె.

చాంద్ పాష అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ యేకుల రాజరావు,డాక్టర్ అన్సారీ,మసియుద్దిన్,ఖాజ ముహిత్,కొండ లలిత హజరయ్యారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాంద్ పాష మాట్లాడుతూ విద్యకు దూరమవుతున్న కొన్ని వర్గాలకు విద్యపై అవగాహన కల్పిస్తూ చైతన్యవంతులను చేయవలసిన అవసరం సమాజంపై ఉందన్నారు.

జిల్లా అధ్యక్షుడు నజీర్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చరిత్రను తెలుపుతూ, ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ, అవగాహన కల్పించి చైతన్యవంతులను చేసే కార్యక్రమాలను ఇంకా మా సంస్థ ద్వారా చేయాడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యాపకులకు అతిథుల చేతుల మీదుగా శాలువాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కమిటీ సభ్యులు రఫీ,షేక్ సద్దాం,జహంగీర్, రియాజ్,అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.

వివేక్ రామస్వామి, మస్క్‌ల రూపంలో బీజింగ్‌కు ముప్పు .. చైనా విద్యావేత్త హెచ్చరిక