ఎన్టీఆర్ 30 లో ఛాన్స్ దక్కించుకున్న నేషనల్ క్రష్ రష్మిక?

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ లో నటించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందారు.

మూడు సంవత్సరాలు ఈ సినిమా కోసం తన సమయాన్ని కేటాయించిన ఎన్టీఆర్ తన తర్వాత సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నాడు.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ 30అనే సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు.

అయితే ఈ సినిమాలో మొదట ఆలియా భట్ ఎన్టీఆర్ కి జోడిగా నటించనుందని వార్తలు వినిపించాయి.

అయితే అలియా భట్ ఇటీవల తన ప్రియుడు రణబీర్ కపూర్ ని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.

ఇలా అలియాభట్ ఉన్న ఫలంగా వివాహం చేసుకోవడంతో ఈ సినిమా నుండి తప్పకుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయం గురించి మూవీ మేకర్స్ ఇప్పటి వరకు ఎక్కడ స్పందించలేదు.అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ కి జోడీగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించనుందని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

పుష్ప సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక అల్లు అర్జున్ తో కలిసి పుష్ప 2 సినిమాలో నటించనుంది.

"""/"/ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్త గురించి నిజం తెలియాలంటే మూవీ యూనిట్ స్పందించాల్సి ఉంటుంది.

" ఎన్టీఆర్ 30 " సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించనున్నాడు.ప్రస్తుతం ఎన్టీఆర్ ఆంజనేయ స్వామి దీక్షలో ఉండటం వల్ల ఈ సినిమా షూటింగ్ మొదలు కావడానికి ఇంకా ఆలస్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఈ సినిమా ని 2023 ఈ సంవత్సరం ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సమాచారం.

ఈ సినిమా గురించి పూర్తి వివరాలు త్వరలోనే మూవీ మేకర్స్ వెల్లడించనున్నారు.

వైరల్ వీడియో: అరటిపండ్లు అమ్మే వ్యక్తి దేశ పరువు మంటకలిపాడుగా!