జాతీయ బిసి యువజన సంఘం ఎల్లారెడ్డిపేట మండల కమిటీ నియామకం

రాజన్న సిరిసిల్ల జిల్లా : జాతీయ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కమిటీని నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు.

ఎల్లారెడ్డిపేట మండల అధ్యక్షులుగా మండల కేంద్రానికి చెందిన పందిర్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా గుండారం గ్రామానికి చెందిన సిద్దాల బాలయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన మానుక రాజు, కార్యదర్శులుగా దుమల గ్రామానికి చెందిన రగుడు బాబు, గొల్లపల్లి గ్రామానికి చెందిన చిర్ల రాజు, సహకార కార్యదర్శిగా బండ లింగంపల్లి గ్రామానికి చెందిన బాలరాజు రమేష్, కోశాధికారిగా వెంకటాపూర్ గ్రామానికి చెందిన దుంపలపల్లి రాజు, మండల గౌరవ అధ్యక్షులుగా గొల్లపల్లి గ్రామానికి చెందిన పొత్తూరి శివ నీ నియమించారు.

ఈ కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండలం గౌరవ అధ్యక్షులు ప్రశాంత్, వేములవాడ రూరల్ మండల ఉపాధ్యక్షులు వంగ మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

తన రెమ్యునరేషన్ గురించి వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే?