రాజన్న సిరిసిల్ల పూర్వ డీఈవో డాక్టర్ రాధా కిషన్ కు జాతీయ పురస్కారం

సి ఎస్ ఆర్ నిధులతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి గానూ బెస్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌ అవార్డు 23 న కేంద్ర మంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకొనున్న డాక్టర్ రాధా కిషన్( Dr.

Radha Kishan ).రాజన్న సిరిసిల్ల జిల్లా పూర్వ డీఈవో డాక్టర్ రాధా కిషన్ జాతీయ ఇన్నోవేషన్‌ అవార్డుకు ఎంపికయ్యారు.

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ప్లానింగ్‌ అండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నీపా) ఈ అవార్డును అందజేయనుంది.

రాజన్న సిరిసిల్ల డీఈవోగా ఉన్న కాలంలో సీఎస్సార్‌ నిధులతో బడులను అభివృద్ధి చేయడం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనివ్వడంతో రాధాకిషన్‌ కు బెస్ట్‌ అడ్మినిస్ట్రేటర్‌ అవార్డుకు ఎంపికయ్యారు.

ఈ అవార్డుల కోసం జాతీయస్థాయిలో ఎన్నో నామినేషన్లు వచ్చిన డీఈవో డాక్టర్ రాధా కిషన్ కృషి అత్యంత ప్రభావితంగా నిలిచింది.

డాక్టర్ రాధా కృష్ణ తో పాటు మేడ్చల్‌-మల్కాజిగిరి డీఈవో విజయకుమారి కూడ ఈ అవార్డుకు ఎంపిక అయ్యారు.

ఈ నెల 23న ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు.

ట్రాఫిక్ బ్లాక్ చేసిన స్కూటర్ డ్రైవర్.. జవాన్ కొట్టిన దెబ్బకు దిమ్మతిరిగింది..?