రోజుకు 65 లీటర్ల పాలిచ్చే ఆవు, రూ.10కోట్లు విలువచేసే దున్నపోతు ఒకేచోట!

రోజుకు 65 లీటర్ల పాలిచ్చే ఆవు, రూ.10కోట్లు విలువచేసే దున్నపోతు ఒకేచోట!

అవును, ఇది అబద్ధం కాదు.మీరు విన్నది నిజమే.

రోజుకు 65 లీటర్ల పాలిచ్చే ఆవు, రూ.10కోట్లు విలువచేసే దున్నపోతు ఒకేచోట!

డైరెక్ట్ గా విషయంలోకి వెళ్ళిపోదాం రండి.ఇండియాలోనే అతిపెద్ద జంతు ప్రదర్శన ఉత్తరప్రదేశ్‌లోని ( Uttar Pradesh ) ముజఫర్‌నగర్‌లో ఏప్రిల్ 6, 7 తేదీల్లో నిర్వహించడం జరిగింది.

రోజుకు 65 లీటర్ల పాలిచ్చే ఆవు, రూ.10కోట్లు విలువచేసే దున్నపోతు ఒకేచోట!

ఈ ప్రదర్శనలో దేశం నలుమూలల నుండి ఆవులు, గేదెలు, ఎద్దులు, మేకలు, గుర్రాలు, గొర్రెలు వంటి జంతువులను యజమానులు పోటీకి తోలుకు వచ్చారు.

గెలుపొందిన జంతువులు వరుసగా రూ.5 లక్షలు, రూ.

2 లక్షలు,రూ.1 లక్ష రివార్డులు ఇక్కడ అందుకోవడం విశేషం.

"""/" / ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం 18 రకాల జంతువులకు ప్రైజ్ మనీగా దాదాపు రూ.

50 లక్షలు పంపిణీ చేసారు నిర్వాహకులు.కాగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఇంత పెద్ద ఎత్తున జంతుప్రదర్శన నిర్వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

దాంతో దీనికి బాగా అక్కడ పేరు వచ్చింది.ఈ ప్రదర్శనను కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్​ గడ్కరీ ప్రారంభించడం విశేషం.

కాగా ఈ నేషనల్ యానిమల్ ఎగ్జిబిషన్‌లో ర్యాప్‌లో షేరా మేక, కరిష్మా గేదె క్యాట్‌వాక్ సందర్శకులను ఆకట్టుకుంది.

ఇక్కడ జంతువుల అందాన్ని చూసి ప్రజలు చప్పట్లతో హోరెత్తించారు. """/" / ఈ క్రమంలోనే రూ.

10 కోట్ల విలువ గల ఓ దున్నపోతు ఈ ప్రదర్శనలో పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

అంతే కాకుండా రోజుకు 65 లీటర్ల పాలిచ్చే హైబ్రిడ్​ ఆవు( Hybrid Cow ) కూడా మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ ఆవు రోజుకు 3 సార్లు పాలు ఇస్తుందని ఈ క్రమంలో 65 లీటర్ల వరకు పాలు ఇస్తుందని యజమాని తెలిపాడు.

దీని ధర రూ.5 లక్షలకు పైగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా చెప్పాడు.

వీటితో పాటు ఈ ప్రదర్శనలో హరియాణాకు చెందిన ఆవులు, గేదెలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

దేశం నలుమూలల నుంచి దాదాపు 1200 పశువులతో పాటు 50 వేల మంది రైతులు, పశుకాపరులు ఇక్కడ రావడం జరిగింది.

నా భార్యను ఈ గొడవలోకి లాగారు… ఎవరిని వదిలిపెట్టను: మంచు మనోజ్