కంగనాపై గట్టిగా విమర్శలు చేసిన నసీరుద్దీన్ షా, ఆదిత్యా పంచోలీ
TeluguStop.com
సుశాంత్ ఆత్మహత్య ఘటనని అడ్డుపెట్టుకొని కంగనా రనౌత్ రోజు రోజుకి బాలీవుడ్ సెలబ్రిటీల మీద తన వ్యక్తిగత ద్వేషం చూపిస్తూ వస్తుంది.
ప్రతి రోజు ఏదో ఒక కారణం చూపిస్తూ ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తుంది.
ముఖ్యంగా కరణ్ జోహార్ మీద ఆమె ఓ విధంగా ప్రతీకారంతో రగిలిపోతుంది.వాళ్ళిద్దరికీ గతంలో ఏం జరిగిందో తెలియదు కాని ఆమె తన పగ తీర్చుకోవడానికి సుశాంత్ ఇష్యూని ఒక బూచిగా వాడుకుంటుంది.
నెపోటిజం అంటూ అందరి మీద మాటలతో దాడి చేసిన ఈమె వాఖ్యలని ఎవరు తప్పు పట్టిన వారి మీద కూడా తన కోపాన్ని వెళ్లగక్కుతుంది.
ఈ నేపధ్యంలోనే కొద్ది రోజుల క్రితం కరణ్ జోహార్ పద్మశ్రీకి అర్హుడు కాదని దానిని వెనక్కి తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేసింది.
దీనిపై కొంత మంది సీనియర్ నటులు ఆమెపై ఎదురుదాడి చేశారు.వీరిలో ముఖ్యంగా సీనియర్ నటులు నసీరుద్దీన్ షా, ఆదిత్యా పంచోలీ ఉన్నారు.
సుశాంత్ ఇష్యూని ఆమె వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటుంది నసీరుద్దీన్ షా కంగనాపై విమర్శలు చేశారు.
ఈ నేపధ్యంలో ఆమె అతని మీద ఎదురుదాడి స్టార్ట్ చేసింది.మిడిమిడి జ్ఞానంతో మాట్లాడొద్దని నసీరుద్దీన్ ను హెచ్చరించారు.
కంగన కౌంటర్‌కు నసీరుద్దీన్ దీటుగా జవాబిచ్చారు.న్యాయవ్యవస్థపై నమ్మకం ఉండాలని, ప్రతి దానిని తమకు అన్వయించుకొని పోరాటం చేస్తున్నట్టు మాట్లాడకూడదని హితవు పలికారు.
మిడిమిడి జ్ఞానంతో ఇతరుల విషయాలలో వేలుపెట్టేవారి మాటలు ఎవరూ పట్టించుకోరని ఎద్దేవా చేశారు.
దీనికి కంగన మళ్ళీ రిప్లై ఇచ్చారు.ఒకవేళ తాను అనిల్ కపూర్, ప్రకాష్ పదుకొణెల కూతురిని అయివుంటే షా ఇలాంటి వ్యాఖ్యలు చేయగలిగే వారా అని మండిపడ్డారు.
దీంతో కంగనకు ఎవరూ సమాధానం ఇవ్వవద్దని, ఆమెతో ఏ విషయం మాట్లాడాలన్నా అందరూ భయపడుతున్నారని షా చెప్పుకొచ్చారు.
కరణ్ జోహార్ పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేయాలని కంగన అంటోంది.ఆమె తనకు తాను రాష్ట్రపతి అనుకుంటుందేమో.
ఆమె స్థానం ఏంటో ఒక్కసారి గుర్తుచేసుకుంటే మంచిది అని హితవు పలికారు.అదే పనిగా అందరి మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్న కంగనా కూడా పద్మశ్రీ వెనక్కి ఇచ్చేయాలని ఆదిత్యా పంచోలీ కూడా ఆమెకి కౌంటర్ వేశారు.
అదిదా ట్విస్ట్.. భార్యను ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త.. కానీ చివరకు?