రోదసి యాత్రలతో కుబేరుల దూకుడు.. నాసా తక్కువ తిన్లేదు, ప్రజలకు అదిరిపోయే ఆఫర్

గత కొన్ని రోజులుగా అంతరిక్ష యాత్రలపై అన్ని దేశాల మీడియాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన కథనాలు వెలువడుతున్న సంగత తెలిసిందే.

‘వర్జిన్‌ గెలాక్టిక్‌’ సంస్థ అధినేత – బ్రిటీషర్‌ రిచర్డ్‌ బ్రాన్సన్‌ జూలై 11న, అది జరిగిన సరిగ్గా తొమ్మిది రోజులకు జూలై 20న ఆ సంస్థకు బలమైన ప్రత్యర్థి ‘బ్లూ ఆరిజన్‌’ అధినేత– అమెరికన్‌ వ్యాపారి జెఫ్‌ బెజోస్‌ తమ బృందాలతో రోదసీ విహారం చేసి వచ్చారు.

వీటి గురించి ఇవాళ ప్రపంచమంతా గొప్పగా చెప్పుకుంటోంది.త్వరలోనే ‘టెస్లా’ సంస్థ అధినేత ఎలన్‌ మస్క్‌ తన ‘స్పేస్‌ ఎక్స్‌’ సంస్థతో జరిపేది మూడో రోదసి యాత్ర.

నిజానికి, ఇవన్నీ కుబేరుల మధ్య పోటాపోటీ రోదసీ యాత్రలు.అయితేనేం, ఖర్చు పెట్టుకొనే స్థోమతే ఉంటే, ఎవరైనా సరే సునాయాసంగా అంతరిక్ష విహారం చేసి రావచ్చని తెలిపిన నిరూపణలు.

భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం ఓ ప్రధాన రంగంగా ఆవిర్భవించనుందని చాటిచెప్పిన సంఘటనలు.అయితే ఇప్పటి వరకు అంతరిక్ష యాత్రలంటే ప్రభుత్వ కనుసన్నల్లోనే జరిగేవి.

ప్రైవేట్ రంగం ఆ ప్రయోగాలకు కావాల్సిన చిన్న చిన్న పనులు చేసే పెట్టేది.

కానీ వర్జిన్, బ్లూ ఆరిజన్, స్పేస్ ఎక్స్‌ల దూకుడు చూస్తుంటే.రాబోయే రోజుల్లో అంతరిక్షం ప్రైవేట్ గుప్పిట్లోకి వెళ్లిపోతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) తానేం తక్కువ తిన్లేదన్నట్లు సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది.

అంగారక గ్రహం మాదిరిగా వుండే కృత్రిమంగా సృష్టించిన వాతావరణంలో ఏడాది పాటు నివసించేందుకుగాను ఔత్సాహికుల నుంచి నాసా దరఖాస్తులు ఆహ్వానించింది.

ప్రస్తుతానికి అమెరికా పౌరులు, అక్కడ శాశ్వత నివాస హోదా ఉన్నవారే ఈ కార్యక్రమానికి అర్హులు.

హ్యూస్టన్‌లోని జాన్సన్‌ అంతరిక్ష కేంద్రంలోని ఓ భవనంలో ‘మార్స్‌ డ్యూన్‌ ఆల్ఫా’ అనే ప్రత్యేక ఆవాసం ఉంది.

దాని విస్తీర్ణం 1,700 చదరపు అడుగులు.త్రీడీ ముద్రిత విధానంలో సృష్టించిన ఈ ఆవాసంలో అచ్చం అంగారకుడి మీద వుండే వాతావరణం ఉంటుంది.

"""/"/ భవిష్యత్‌లో అంగారకుడిపైకి వ్యోమగాములను పంపడంతో పాటు భారీ ప్రయోగాలకు ప్రణాళికలు రచిస్తున్న నాసా.

అక్కడికి వెళ్లేవారికి శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశముందో ముందుగానే తెలుసుకోవాలని నిర్ణయించింది.

పరిమిత వనరులు, కమ్యూనికేషన్‌లో జాప్యం, పరికరాల వైఫల్యం వంటి సవాళ్లను వారు ఎలా ఎదుర్కొంటారన్నదానిపై అధ్యయనానికి సిద్ధమైంది.

దీనిలో భాగంగా ఔత్సాహికులైన అమెరికా పౌరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది.వచ్చిన మొత్తం దరఖాస్తుల నుంచి నలుగుర్ని ఎంపిక చేసి.

ఏడాది పాటు ‘మార్స్‌ డ్యూన్‌ ఆల్ఫా’లో ఉంచుతామని ప్రకటించింది.సో.

ఇంకేందుకు ఆలస్యం.భూమిపై నివసించడం బోర్‌ కొడుతున్న వాళ్లు, ఇలాంటి వాతావరణంలో కాకుండా.

మరేదైనా ప్రత్యేక పరిస్థితుల్లో ఉండాలనుకునేవారు ప్రయత్నించి చూడండి.‘‘ ఆల్‌ ది బెస్ట్’’.

వీడియో వైరల్: నేషనల్ హైవేపై ఒక్కసారిగా విరిగిపడ్డ కొండ చరియలు..