చివరి కోరిక తీరకుండా చనిపోయారు.. నర్సింగ్ భార్య కీలక వ్యాఖ్యలు..!

కామెడీ పాత్రల్లో, విలన్ పాత్రల్లో, రాజకీయ నాయకుడి పాత్రల్లో నటించి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు నర్సింగ్ యాదవ్.

2020 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన కిడ్నీ సమస్యతో హైదరాబాద్ లో నర్సింగ్ యాదవ్ మృతి చెందారు.

నర్సింగ్ యాదవ్ సతీమణి చిత్ర తాజాగా మీడియాతో ముచ్చటిస్తూ నర్సింగ్ యాదవ్ కు సంబంధించిన ఎన్నో కీలక విషయాలను ఆమె మీడియాకు వెల్లడించారు.

తాను బీటెక్ లో సీఎస్సీ చదివి సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేదాన్నని తిరుపతిలో ఒక పెళ్లిలో నర్సింగ్ యాదవ్ తనను తొలిసారి చూశారని అన్నారు.

తనను పెళ్లి చేసుకుంటానని మొదట ఆయనే అడిగారని తనతో లైఫ్ బాగుంటుందని నమ్మకం కుదిరి తాను అంగీకరించానని చిత్ర చెప్పుకొచ్చారు.

తమది పెద్దలు కుదిర్చిన లవ్ మ్యారేజ్ అని 2000 సంవత్సరం నవంబర్ నెలలో తమ వివాహం జరిగిందని ఆమె అన్నారు.

"""/"/ ఇరవై సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నానని చిత్ర తెలిపారు.

నర్సింగ్ 300కు పైగా సినిమాలలో నటించారని చిరంజీవి గారు నర్సింగ్ కు గాడ్ ఫాదర్ అని చెప్పుకొచ్చారు.

కిడ్నీ సమస్య వల్ల గత కొన్నేళ్ల నుంచి ఆయన సినిమాలు తగ్గించారని చిత్ర తెలిపారు.

భారత క్రికెటర్లు సచిన్, కోహ్లీలతో కూడా నర్సింగ్ కు సత్సంబంధాలు ఉన్నాయని ఆమె అన్నారు.

నర్సింగ్ ది ఇతరులకు సహాయం చేసే మనస్త్వత్వమని ఆకలి అని అనేవారికి ఆయన అన్నం పెట్టేవారని చిత్ర తెలిపారు.

కిడ్నీ సమస్యతో బాధ పడుతున్న సమయంలో మంచంపై పడకుండా సినిమాల్లో నటించాలని నర్సింగ్ చెప్పేవారని కానీ చివరి కోరిక తీరకుండానే ఆయన చనిపోయారని చిత్ర తెలిపారు.

కొడుకు రుత్విక్ యాదవ్ బీటెక్ చదువుతున్నాడని రుత్విక్ కు సినిమాలపై అస్సలు ఆసక్తి లేదని నర్సింగ్ కు మాత్రం కొడుకును సినిమాల్లో చూడాలని అనుకునే వారని ఆమె తెలిపారు.

కాంగ్రెస్ లో చేరబోతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీరేనా ?