నేడు నరసింహ స్వామి జయంతి.. ఈరోజు ఏం చేయాలంటే?

పురాణాల ప్రకారం విష్ణుమూర్తి దశావతారాలలో నాలుగవ అవతారం నరసింహ స్వామి అవతారం.హిరణ్యకశిపుడు పొందిన వరం కోసం నరసింహ స్వామి సగం మనిషి అవతారం, సగం సింహం అవతారం ఎత్తి హిరణ్యకశిపుని సంహరిస్తాడు.

విష్ణుమూర్తి వైశాఖ శుక్ల చతుర్దశి రోజు నరసింహ అవతారం ఎత్తాడు కనుక ఈ రోజున నరసింహ స్వామి జయంతిగా జరుపుకుంటారు.

ఏడాది నరసింహ జయంతి మే 25 న వచ్చింది.నరసింహ స్వామి వారు వివిధ రూపాలలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు.

సుమారు 74 అవతారాల కంటే ఎక్కువగా ఉన్నాయి.వీటిలో 9 ప్రధాన రూపాలను నవ నరసింహ స్వామిగా కొలుస్తారు.

ఉక్ర నరసింహ, క్రోటా నరసింహ, వీర నరసింహ, విలంబ నరసింహ, కోపా నరసింహ, యోగ నరసింహ, అగోరా నరసింహ, సుదర్శన నరసింహ.

అనే తొమ్మిది రూపాలుగా కొలుస్తారు.చతుర్దశి తిథి 2021 మే 25 00:11 నుండి ప్రారంభమై 2021 మే 25 న 20:29 వద్ద ముగుస్తుంది.

ఈ రోజు భక్తులు ఉపవాసం ఉండాలి, నరసింహ స్వామి జయంతి రోజు ముఖ్యంగా స్వామి వారికి సూర్యాస్తమయ సమయంలో పూజలు చేయాలి.

సూర్యాస్తమయం అయ్యేటప్పుడు ఈ నరసింహావతారం కనిపించనందున సూర్యాస్తమయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

సంధ్యాసమయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యంగా పానకం సమర్పించాలి. """/"/ అదేవిధంగా పూలు పండ్లు దక్షిణ తాంబూలాలతో ఉపవాసం స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.

పూజానంతరం ఓం నమో నారసింహాయ' అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే స్వామివారి కటాక్షం దక్కుతుందంటారు.

అదే విధంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు సైతం తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

నరసింహ జయంతి ఉత్సవాలను నరసింహ ఆలయాలలో పెద్ద ఎత్తున నిర్వహిస్తారు.

చంద్రబాబుకు ఓటు వేస్తే సంక్షేమ పథకాలు ముగింపే..: సీఎం జగన్