అందగత్తెలు కావాలంటే నాకు చాలామంది వస్తారన్న నరేష్.. అందం తక్కువా అంటూ?

సీనియర్ నరేష్( Naresh ), పవిత్ర జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమా థియేటర్లలో రిలీజ్ కావడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.

ఈ సినిమా నరేష్ పవిత్రల బయోపిక్ అని చాలామంది భావిస్తున్నా మేకర్స్ మాత్రం ఈ మూవీ బయోపిక్ కాదని చెబుతున్నారు.

ఎం.ఎస్.

రాజు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా నరేష్, పవిత్ర వరుస ఇంటర్వ్యూలతో ఈ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచేశారు.

ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నరేష్ మాట్లాడుతూ ఎవరి జీవితం వాళ్లదని అవతలి వ్యక్తి గురించి కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయో అప్పుడే విడాకులు ఇవ్వాలని ఫ్యామిలీ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

అప్పటివరకు పిల్లాడి కోసం విడాకుల విషయంలో ఆగామని నరేష్ అన్నారు.నన్ను బ్లాక్ మెయిల్ చేయాలనే ప్రయత్నం జరిగిందని ఆయన కామెంట్లు చేశారు.

రేపు నన్ను చంపేస్తే నా పరిస్థితి ఏంటని నరేష్ పేర్కొన్నారు. """/" / మైసూర్( Mysore ) లో జరిగిన ఘటన సమయంలో నేను విజిల్ వేసుకుంటూ బయటకు వచ్చానని నరేష్ పేర్కొన్నారు.

మేము మా రిలేషన్ ను పర్సనల్ గా పెట్టుకోవడంతో నేను నరేష్ వీక్ నెస్ కావడంతో నన్ను టార్గెట్ చేశారని పవిత్ర లోకేశ్( Pavitra Lokesh) తెలిపారు.

నేను యంగ్ అని స్ట్రాంగ్ అని నరేష్ పేర్కొన్నారు.పవిత్ర నా బలం అని ఆయన తెలిపారు.

నా ఆస్తుల గురించి కూడా పవిత్రకు తెలియదని ఆయన వెల్లడించారు. """/" / అందగత్తెలు కావాలనుకుంటే నాకు చాలామంది వస్తారని నాకేం తక్కువ.

డబ్బు తక్కువా అందం తక్కువా అంటూ నరేష్ వెల్లడించారు.నాకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరమో పెళ్లి కోసం ప్రయత్నించాల్సిన అవసరమో లేదని ఆయన చెప్పుకొచ్చారు.

పవిత్రలో క్యారెక్టర్ నచ్చి లైక్ చేశానని నరేష్ పేర్కొన్నారు.మా అమ్మ పుట్టినరోజు పవిత్ర పుట్టినరోజు ఒకటే రోజు అని ఆయన కామెంట్లు చేశారు.