ఈ గొడవల కారణంగా ఆ సీనియర్ నటుడి అవకాశాలు సగం తగ్గాయట
TeluguStop.com
హీరో గా ఎన్నో సినిమాల్లో నటించిన నరేష్ వయసు పెరగడం తో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుసగా సినిమా లు చేసిన విషయం తెలిసిందే.
ఆయన నటించిన సినిమా లు నెల లో కనీసం నాలుగైదు విడుదల అవడం ఒక సమయం లో మనం చూసాం.
కానీ ఈ మధ్య కాలం లో నరేష్ సినిమాలు తగ్గాయి అంటూ ప్రచారం జరుగుతుంది.
ఒకప్పుడు చిన్న పాత్రలకు కూడా ఆయన ను సంప్రదించిన ఫిలిం మేకర్స్ ఇప్పుడు ఆయనను సంప్రదించేందుకు ఆసక్తి చూపడం లేదంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
అందుకు కారణం గత కొన్నాళ్లుగా ఆయన ఎదుర్కొంటున్న పెళ్లిళ్ల వివాదం.మూడో భార్య రమ్య రఘుపతి కి ఇంకా విడాకులు ఇవ్వకుండానే పవిత్ర లోకేష్ తో సహజీవనం సాగించడం.
అది వివాదం గా మారడం దాంతో చాలా సార్లు ఆయన కోర్టు కు వెళ్లడం.
ఇంకా పలు వివాదాలను ఎదుర్కోవడం జరుగుతుంది.ఆ కారణం గా సినిమా లపై ఫోకస్ పెట్టలేక పోతున్నాడు.
అలాగే సరిగా నటించలేక పోతున్నాడట. """/" /
ఆ కారణాలు చెబుతూ ఫిల్మ్ మేకర్స్ ఆయన ను సినిమాల్లోకి తీసుకోవడం లేదు అంటూ కొందరి ఫిలిం మేకర్స్ ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నారు.
ఇప్పటికే నరేష్ సినిమా ల సంఖ్య చాలా తగ్గింది.ఈ గొడవలు ఇంకా పెరిగితే కచ్చితంగా ఆయన కెరియర్ పై తీవ్రమైన ప్రభావం ఉంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
రోజు వారి పారితోషికం చొప్పున డేట్లు ఇచ్చే నరేష్ ఒక్క రోజు కి ఏకంగా రూ.
5 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. """/" /
అలాంటి నరేష్ తో వరుసగా సినిమా లు నిర్మించాలంటే కాస్త రిస్క్ ఎక్కువే.
అయినా కూడా ఫిలిం మేకర్స్ ఆయన్ని ఇంతకు ముందు వరుసగా తమ సినిమాల్లో తీసుకున్నారు.
కానీ ఇప్పుడు ఆయన వివాదాల కారణంగా తగ్గించారని ప్రచారం జరుగుతుంది.పెళ్లి వివాదాలకు త్వరలో ఫుల్ స్టాప్ పెట్టి నరేష్ మళ్లీ సినిమా లతో బిజీ అవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
EU Online Gambling Laws — Practical Strategy For High Rollers With Montreal Casino Online Interests