Naresh : ఎలాంటి పాత్ర దొరికిన అద్భుతంగా నటించడంలో నరేష్ తర్వాతే ఎవరైనా !
TeluguStop.com
నరేష్ విజయ్ కృష్ణ.60 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలతో సమానంగా నటించగల నటుడు.
వ్యక్తిగత జీవితంలో ఎన్నో విమర్శలకు ఎదుర్కొంటూ పెళ్లిళ్ల పైన పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు అనే అపవాదును కూడా మోస్తూ కెరియర్ ను మాత్రం చక్కగానే నడిపిస్తున్నాడు.
తన వ్యక్తిగత జీవితంలో ఎన్ని రకాల విమర్శలున్న అవి కెరియర్ పై ప్రభావం చూపించకపోవడం కూడా నరేష్ కలిసి వచ్చే అంశమే.
నిజానికి నరేష్( Actor Naresh ) ఒక అద్భుతమైన నటుడు.హీరోగా తన తల్లి చేతులపై లాంచ్ చేయబడి ఎన్నో సినిమాల్లో నటించి వయసు పెరిగిన కొద్ది తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తూ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో సెటిల్ అయిపోయాడు.
"""/"/
ప్రస్తుతం నరేష్ హీరోకి లేదా హీరోయిన్ కి తండ్రి పాత్రలో నటిస్తూ మంచి పర్ఫామెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ వెళ్తున్నాడు.
నిన్నటికి నిన్న శ్రీ విష్ణు హీరోగా సామజవరగమన( Samajavaragamana ) అనే సినిమాలో నరేష్ కూడా నటించాడు.
ఈ సినిమా కామెడీ ప్రధానంగా తెరకెక్కగా అందులో నరేష్ హీరోకి తండ్రి పాత్రలో నటించాడు.
తనదైన కామెడీతో సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు నరేష్.ఇక నరేష్ కామెడీ( Naresh Comedy )తో పాటు సీరియస్ రోల్స్ కూడా చాలా చక్కగా చేయగలరు ఎలాంటి పాత్ర ఇచ్చిన అందులో ఒదిగిపోయి నటించగలడు.
రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ కి తండ్రిగా అతని అన్న చనిపోయినప్పుడు ఎక్కి ఎక్కి ఏడ్చి ఎంతో ఎమోషన్ పండించడంలో నరేష్ సక్సెస్ సాధించాడు ఇలా నరేష్ నవ్వించడంతో పాటు ఏడిపించడం లోను దిట్ట.
"""/"/
సినిమాలో ఏ పాత్ర ఇచ్చినా న్యాయం చేయగలిగి కెమెరా స్పేస్ పెంచుకుంటూ వరుస సినిమాలు చేస్తున్నాడు.
ఇక ఇటీవలే మళ్లీ పెళ్లి( Malli Pelli ) అనే సినిమా కూడా తన డబ్బులతో తీసి పరవాలేదనిపించుకున్నాడు.
ఏది ఏమైనా ఎన్ని వ్యవహారాలు నడిచిన నరేష్ ఒక గొప్ప నటుడు ఏ ఎమోషన్ అయినా చాలా అలవోకగా పండించగలరు తల్లి నుంచి నటన వారసత్వాన్ని అందుకొని ఆమె పేరును నటన పరంగా కాపాడటంలో నరేష్ పూర్తిగా సఫలమయ్యాడు.