మళ్లీ పెళ్లికి నరేష్ పెట్టిన ఖర్చు ఎంత? విడుదలకు ముందు వచ్చింది ఎంత?

సీనియర్ నరేష్( Naresh ) మరియు పవిత్ర లోకేష్ లు ముఖ్య పాత్రల్లో నటించిన మళ్లీ పెళ్లి సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

నరేష్‌ స్వయంగా ఈ సినిమా ను నిర్మించాడు.గత కొంత కాలంగా నరేష్ మరియు పవిత్ర లోకేష్ లు ప్రేమలో ఉన్నారు అనే విషయం తెల్సిందే.

అదే సమయంలో నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి( Ramya Raghupathi ) తో విడాకులు తీసుకునేందుకు సిద్ధం అయ్యాడు.

రమ్య రఘుపతికి విడాకులు ఇవ్వకుండానే పవిత్ర లోకేష్ తో సహజీవనం సాగిస్తున్న నరేష్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.

ఆ మధ్య జరిగిన యదార్థ సంఘటనలు మరియు గొడవల నేపథ్యంలో సినిమాను రూపొందించడం జరిగింది.

అదే మళ్లీ పెళ్లి అంటూ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. """/" / సినిమాలో ఆకట్టుకునే ఎలిమెంట్స్ లేవు అంటూ కొందరు రివ్యూ ఇచ్చారు.

ఆ విషయం పక్కన పెడితే ఈ సినిమా కు నరేష్ పెట్టిన ఖర్చు ఎంత.

వచ్చిన మొత్తం ఎంత అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.ఈ సినిమాలో స్టార్ కాస్ట్‌ పెద్దగా లేదు.

కనుక మేకింగ్‌ కోసమే కాస్త ఎక్కువగా నరేష్‌ మరియు దర్శకుడు ఎంఎస్ రాజు( M.

S.Raju ) ఖర్చు చేయడం జరిగింది.

"""/" / నరేష్‌ ఈ సినిమా కోసం దాదాపుగా రూ.20 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగిందంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.

సినిమా లో కొన్ని సన్నివేశాల కోసం కాస్త ఎక్కువగానే ఖర్చు చేశారు.దాంతో సినిమా రూ.

20 కోట్ల వరకు వెళ్లింది అనే చర్చ జరుగుతోంది.థియేట్రికల్‌ బిజినెస్ ద్వారా దాదాపుగా రూ.

12 కోట్ల రూపాయలు నరేష్ కి వెనక్కి వచ్చాయి.ఓటీటీ మరియు శాటిలైట్ రైట్స్ ద్వారా భారీ మొత్తం వస్తాయని ఆశిస్తున్నాడు.

సినిమా కి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చి ఉంటే వసూళ్లు భారీగా వచ్చి ఉండేవి.

అలాగే ఓటీటీ రైట్స్ కి మంచి డిమాండ్ ఉండేది.ఇప్పుడు పెట్టిన బడ్జెట్‌ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ టాక్ వినిపిస్తుంది.

వర్షాకాలంలో దుస్తుల నుంచి చెడు వాసన రాకుండా ఉండాలంటే ఈ టిప్స్ ను తప్పక పాటించండి!