Narendra Modi : విశాఖ కు మోదీ .. బీజేపీ వ్యూహం ఏంటంటే ? 

ఏపీ విషయంలో బిజెపి అగ్ర నేతల వైఖరి ఏమిటనేది స్పష్టత లేకపోయినా,  గత కొద్ది రోజులుగా మాత్రం ఏపీ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.

ఒకవైపు టిడిపి,  జనసేనతో పొత్తు వ్యవహారంపై చర్చలు జరుపుతూనే విడిగా పార్టీ కార్యక్రమాలను చేస్తున్నారు.

ఈరోజు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన ఉంది.ఇక ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోదీ( Narendra Modi ) తో పాటు బిజెపి అగ్ర నేతలు విశాఖలో పర్యటించారు.

ముందు ప్రకటించినట్లుగా మార్చి ఒకటిన జరగాల్సిన ఈ టూర్ వాయిదా పడింది.  ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే ప్రధాని నరేంద్ర మోది విశాఖకు వచ్చేలా షెడ్యూల్ రూపొందిస్తున్నారు.

మోది వెంట బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( JP Nadda ) కూడా హాజరవుతారు.

"""/" / విశాఖలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోది ద్వారా ప్రారంభించి , బిజెపికి హైప్ తీసుకువచ్చే ప్రయత్నాలు చేయబోతున్నారు.

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డ విశాఖ నుంచే ఎన్నికల సమర శంఖారావం మొదలుపెట్టనున్నారు.

ఏపీలో ఉన్న 25 లోక్ సభ నియోజకవర్గాలలో బిజెపి ప్రభావం ఉండేవిధంగా ప్రత్యేక కార్యచరణను రూపొందిస్తున్నారు .

ఏపీలో బిజెపి ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉన్న నేపథ్యంలో ఆ పరిస్థితిని మార్చి బిజెపి ప్రభావం ఏపీలో కనిపించే విధంగా బిజెపి అగ్ర నేతలు విశాఖ కేంద్రంగా రాజకీయ వ్యూహాలకు పదును పెట్టనున్నారు.

"""/" /  ఈ మేరకు బిజెపి అగ్రనేతులంతా విశాఖ పర్యటనకు రాబోతుండడం,  పార్టీ కార్యక్రమాలు మరింత ముమ్మరం చేయనున్న నేపథ్యంలో ఏపీ బీజేపీ నాయకులు దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక ఈరోజు ఏపీకి రానున్న కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ( Rajnath Singh )మేధావులతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించనున్నారు.

అలాగే బీజేపీని అభిమానించేవారు,  తటస్తులతో ఆయన సమావేశం అవుతారు.ఈ సందర్భంగా బిజెపికి మద్దతు ఇవ్వాల్సిందిగా వారిని కోరనున్నారు.

ఏపీలో ఉన్న 25 పార్లమెంటు నియోజకవర్గలకు కలిపి ఒక క్లస్టర్ గా చేసి కీలకమైన సమావేశాన్ని నిర్వహించనున్నారు.

ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో బిజెపి ప్రభావం ఉంటుందని,  తమ పర్యటన ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించగలిగితే ఏపీలో కొన్ని స్థానాల్లోనైనా విజయం సాధిస్తామనే నమ్మకం బిజెపి అగ్ర నేతల్లో కనిపిస్తోంది.

ముఖ్యంగా విశాఖ ఎంపీ స్థానం తప్పకుండా గెలుస్తామనే ధీమాలో బిజెపి ఉంది.

ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు ఒక్క దెబ్బతోనే మాయం!