అంగరంగ వైభవంగా మొదలైన నరసింహస్వామి నవరాత్రోత్సవాలు..

ధర్మపురి పుణ్యక్షేత్రంలో శ్రీ నరసింహ స్వామి నవరాత్రోత్సవాలు( Sri Narasimha Swamy Navratri Festivals ) బుధవారం అంగరంగ వైభవంగా మొదలయ్యాయి.

ఇంకా చెప్పాలంటే ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఐదు గంటల 30 నిమిషాలకు అర్చకులు మంగళ వాయిద్యాల తో గోదావరి నదికి వెళ్లారు.

గోదావరి లో పూజలు నిర్వహించిన తర్వాత అక్కడి నుంచి అర్చకులు బిందె తీర్థం పుణ్య క్షేత్రానికి తీసుకొని వచ్చారు.

ఆ తర్వాత దేవాలయ వేద పండితులు బొజ్జ రమేష్ శర్మ, సామవేద పండితులు ముత్యాల శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య అర్చకులు స్వస్తి పుణ్యహవచనం,రుత్విక్వరణం, కలశ స్థాపన శ్రీ స్వామి వరాలకు పంచోపనిషత్తులచే అభిషేకం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు.

"""/" / ఇంకా చెప్పాలంటే సాయంత్రం ఐదు గంటలకు వేదోక్తంగా సహస్ర కలశ స్థాపన, నవగ్రహ, యోగినివాస్తు, క్షేత్ర పాలక స్థాపనలు, అర్చనాది ఆరాధన, హారతి, నిత్య హోమం, నిత్య కళ్యాణం లాంటి పుణ్య కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా నిర్వహించారు.

అంతేకాకుండా చాలా మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో దేవాలయ ఈవో సంకటాల శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ సంఘీ సత్యమ్మ( Municipal Chairman Sanghi Satyamma ), వైస్ చైర్మన్, దేవాలయ రినోవేషన్‌ కమిటీ సభ్యులు ఇందిరాపురామయ్య, డీసీఎంఎస్‌ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి,జూనియర్ సివిల్ కోర్ట్ న్యాయమూర్తి శ్యాంప్రసాద్, జగిత్యాల డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్,సూపరింటెండెంట్‌ ద్యావళ్ల కిరణ్ కుమార్, ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసచార్యులు, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాస్ చారి, రమణ చార్య, నరసింహమూర్తి, సీనియర్ అసిస్టెంట్‌ అలువాల శ్రీనివాస్, అభిషేక్ పౌరోహితులు బొజ్జ సంతోష్ కుమార్, సంపత్ కుమార్, రాజగోపాల్, స్థానిక పండితులు చంద్రమౌళి, విశ్వనాథ్ శర్మ, కమిటీ సభ్యులు రవీందర్, రమా, పద్మా, రవి, సురేందర్, కొమురయ్య, నరేష్, సురేష్, రాజమౌళి, సురేష్, మహేష్ అర్చకులు సిబ్బంది కూడా పాల్గొన్నారు.

బెంగళూరు హోటల్‌లో ఫ్యాన్స్ ఎలా ఉన్నాయో చూస్తే షాకే..?