నరసాపురం ఎంపి సీటు ఆ రాజు గారి దేనా?

ఎన్నికల తేదీ సమీపిస్తున్న కొద్ది తెలంగాణతో పాటు ఆంధ్రలో కూడా రాజకీయ సమీకరణాలు శరవేగం గా కదులుతున్నాయి .

ఇప్పటికే అధికార పార్టీ తనదైన ప్రచార కార్యక్రమాలను మొదలు పెట్టేస్తే.మరోపక్క తెలుగుదేశం జనసేనలు( TDP , Janasena ) సమన్వయ కమిటీ సమావేశాలతో హీట్ పుట్టిస్తున్నాయి.

క్షేత్రస్థాయి సమన్వయం కోసం రెండు పార్టీలు ముందుకు కదులుతున్నాయి.మరోపక్క ఆయా స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తున్నట్లుగా అనధికారికంగా లీకులు వస్తున్నాయి.

"""/" / దాన్లో భాగంగానే పశ్చిమగోదావరి జిల్లా( West Godavari District ) నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థిగా గత ఎన్నికలలో అధికార వైసిపి గుర్తుపై పోటీ చేసిన రఘురామ కృష్ణంరాజు( Raghu Rama Krishnam Raju ) ని ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

గత ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి వైసీపీ అధిష్టానానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈ రెబల్ ఎంపీ గారి తీరు పై వైసీపీ అధిష్టానం కూడా గుర్రుగానే ఉంది .

ఇప్పటికే ఆయన మీద అనేక కేసులు మోపి నియోజకవర్గంలో అడుగు పెడితే అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసింది.

దాంతో గెలిచినప్పటి నుంచి ఢిల్లీలోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ఇంత వరకూ తన నియోజకవర్గంలో ప్రజలను పలకరించలేదు.

"""/" / అయితే జనసేన తెలుగుదేశం పార్టీల ది విన్నింగ్ కాంబినేషన్ కావడంతో, గత ఎన్నికలలో వచ్చిన ఓట్ల శాతాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే తన గెలుపు సులువుతుందన్నది రాజుగారి ఆలోచన గా కనబడుతుంది.

అయితే గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకూ నియోజకవర్గంతో ప్రత్యక్షం గా కానీ పరోక్షం గా కానీ ఏ విదం గానూసంబందాలు లేని రాజు గారిపై ఆ నియోజకవర్గ ఓటర్లు ఎలా ప్రతిస్పందిస్తారన్నది వేచి చూడాలి .

మరోవైపు వైసీపీ అధిష్టానం కూడా ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆ సామాజిక వర్గం నుంచే మరో కీలక నేతను నిలబెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

మరి అధికార పార్టీపై అలుపెరగని పోరాటం చేస్తున్న రాజుగారిపై ఓటరు సానుభూతిగా కరుణిస్తాడా లేక విలువైన ఓటు హక్కును ఇస్తే నియోజకవర్గం గడప తొక్కలేదని నిర్దాక్షిణ్యం గా దూరం పెడతారో అన్నది ఆసక్తికరంగా మారింది.

నిరీక్షణకు తెర.. అమెరికాలో భారత రాయబారిగా వినయ్ క్వాత్రా