నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు చిత్రపటానికి పాలాభిషేకం
TeluguStop.com
పశ్చిమగోదావరి జిల్లా.నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు( Raghu Rama Krishna Raju ) చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఆకివీడు మండలం( Akividu ) దుంపగడప కాటన్ పార్క్ వద్ద ఎంపీ నిధులతో 5 లక్షల రూపాయల తో నిర్మించిన సీసీ రోడ్డు ప్రారంభించారు.
ఎప్పటి నుండో రహదారి లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో స్థానికులు కోరికపై రఘురామ కృష్ణంరాజు తన నిధులు నుండి సీసీ రోడ్డు నిర్మించారు దీంతో స్థానికులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
అదేవిధంగా ఆకివీడు మండలం మందపాడు గ్రామంలో ఎంపీ నిధులు రూ 5 లక్షలతో నిర్మించిన సిసి రోడ్ ను రఘురామ కృష్ణంరాజు తనయుడు భరత్ ప్రారంభించారు ఉండి ఎమ్మెల్యే రామరాజు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు( Siva Rama Raju ) కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే గంగానమ్మ కోడు వీధిలో రూ 10 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డు, ఆకివీడులోని స్టేషన్ రోడ్డు స్మశాన వాటిక పక్కనే ఉన్న సీసీ రోడ్డు ను వారు ప్రారంభించారు.
నా లైఫ్ లో అత్యంత భయానక క్షణాలివే.. మాధవన్ సంచలన వ్యాఖ్యలు వైరల్!