ర‌ఘురామ‌పై ఫైర్ అవుతున్న న‌ర్సాపురం.. ఎక్కువ‌వుతున్న ఈగ‌ల మోత!

ఏపీలోని వైసీపీ రెబ‌ల్ ఎంపీ వ్య‌వ‌హారం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.ఆయ‌న ప్ర‌భుత్వంపై కేంద్ర‌మంత్రుల‌కు, మాన‌వ హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేయ‌డంతో దేశం మొత్తం ఆయ‌న వైపు చూసేలా చేశారు.

ఇంకోవైపు త‌న తోటి ఎంపీల‌కు లేఖ‌లు రాస్తూ వారి మ‌ద్ద‌తు కూడ‌గ‌డుతున్నారు.ఇదిలా ఉంటే ఈయ‌న‌పై జ‌గ‌న్ కూడా సీరియ‌స్ యాక్ష‌న్ తీసుకునేందుకు ప్లాన్ వేశారు.

దీంట్లో భాగంగా ఇటీవ‌ల లోక్ స‌భ స్పీక‌ర్‌కు త‌మ ఎంపీ భ‌ర‌త్‌కుమార్ ద్వారా ఫిర్యాదు చేయించారు.

వైసీపీ పార్టీలో ఉంటూ ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగేలా వ్య‌వ‌హ‌రించిన ర‌ఘురామ‌పై అన‌ర్హ‌త వేటు వేయాలంటూ ఫిర్యాదు చేయించారు.

ఇదొక్క‌టే కాదు.రాష్ట్రంలో ఉన్న త‌మ పార్టీ అధికార వెబ్ సైట్ నుంచి ర‌ఘురామ రాజు పేరును తీసేశారు పార్టీ అధినేత‌లు.

దాంతో పార్టీ నుంచి తొల‌గిస్తున్న‌ట్టు ఇన్‌డైరెక్టుగా ఇంటిమేష‌న్ ఇచ్చారు జ‌గ‌న్‌. """/"/ దీంతో పాటు ఇప్పుడ నియోజ‌క‌వ‌ర్గంలో కూడా ఎంపీ రఘురామకు షాక్‌లు త‌గిలేలా చేస్తున్నారు జ‌గ‌న్‌.

ఆయ‌న సొంత నియోజకవర్గమైన న‌ర్సాపురంలోనే ఆయ‌న‌కు వ్య‌తిరేకత వ‌చ్చే విధంగా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

అక్క‌డి ప్ర‌జ‌లు ఇప్పుడు ఎంపీపై బాగా సీరియ‌స్‌గా ఉన్నారు.న‌ర్సాపురంలో ఈగల మోత విప‌రీతంగా పెర‌గుతున్నా ప‌ట్టించుకోవ‌ట్లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

అంతే కాదు ఇటీవ‌ల న‌ర్సాపురంలో ఎంపీకి వ్య‌తిరేకంగా బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌ని ఏపీ బహుజన ఐక్య వేదిక అధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర‌స‌న చేప‌ట్టారు.

కాగా ఇదంతా వైసీపీ ఆధ్వ‌ర్యంలోనే జ‌రిగిన‌ట్టు స‌మాచారం.రెండేళ్లుగా నియోజ‌క‌వ‌ర్గ డెవలప్ మ‌రిచి అన‌స‌వ‌ర రాజ‌కీయాలు చేస్తున్నారంటూ మండిప‌డుతున్నారు ప్ర‌జ‌లు.

ఓట్లు వేసిన త‌మ‌ను ఎంపీ ర‌ఘురామ గాలికి ఒదిలేసారంటూ విరుచుకుప‌డుతున్నారు.మొత్తానికి ర‌ఘురామ‌కు సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే వ్య‌తిరేక రావ‌డం రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది.

బీట్ రూట్ ఆరోగ్యానికే కాదు జుట్టు రాలడాన్ని కూడా అడ్డుకుంటుంది.. ఎలా వాడాలంటే?