నారదుడికి 60 మంది పిల్లలు ఉన్నారా?

అక్కడి మాటలు ఇక్కడ.ఇక్కడ మాటలు అక్కడ చెప్తూనే.

నారాయణుడి పేరు నిత్యం పారాయణ చేసే నారద మహర్షి గురించి మనందరకీ తెలిసిన విషయమే.

ఆయన మనకు బ్రహ్మచారిగానే తెలుసు.కానీ ఆయనకు పెళ్లై.

60 మంది పిల్లలు ఉన్నారనే విషయం మాత్రం మనకు తెలియదు.ఆయన పెళ్లి ఎప్పుడు, ఎందుకు చేసుకున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్వం నారద మహర్షి తనంత గొప్ప భక్తుడు లేడని.బ్రహ్మచారిగా మారి నిత్యం నారాయణ పేరు స్మరిస్తూ ఉంటానని గర్వంతో విర్ర వీగిపోయేవాడట.

ఇది గ్రహించిన విష్ణు మూర్తి నారదుడి గర్వం తగ్గించాలనుకొని.ఒక కొలనులో స్నానం చేయమని చెప్పాడట.

నారదుడు అలా చేయగానే.విష్ణు మూర్తి మాయ వల్ల అతడు గతం మర్చిపోయి ఆడదానిగా బయటకు వచ్చాడు.

అక్కడే ఉన్న ఓ రాజుని చూసి మోహించి పెళ్లి కూడా చేసుకున్నాడు.అంతేనా గతం అంతా మర్చిపోయి 60 మంది పిల్లలను కూడా కన్నాడు.

వారు పెద్దయ్యాక యుద్ధంలో ఒకరి తర్వాత ఒకరు  మరణిస్తారు.పుత్ర శోకంతో తల్లడిల్లుతున్న నారదుడిని.

విష్ణుమూర్తి కలిసి తాను గతంలో వేసిన మాయను తీసుకుంటాడు.అలా నారద మహర్షికి గతం గుర్తుకు వస్తుంది.

అప్పుడు ఇదీ సంసారం అంటే.నీవు గొప్ప భక్తుడవేం కావని శ్రీ మాహ విష్ణువు.

నారద మునికి హితబోధ చేస్తాడు.అలాగే నీకు పుట్టిన పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారని వరం కూడా ఇస్తాడు.

అందువల్లే మన తెలుగు సంవత్సరాలు 60గా ఉన్నాయి.

అవన్నీ అవాస్తవాలే… యూట్యూబ్ ఛానల్ పై మండిపడిన రేణు దేశాయ్!