నారా రోహిత్ కి ఆ పాపాల వల్లే ఇప్పటికీ పెళ్లి కాలేదా.. ఈ జన్మకు కాదంటూ?

నారా రోహిత్( Nara Rohith ) పరిచయం అవసరం లేని పేరు.ఈయన హీరోగా గతంలో పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

అయితే హీరోగా ఈయన నటించిన సినిమాలో అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఈయనకు సరైన హిట్ మాత్రం ఇప్పటివరకు పడలేదని చెప్పాలి.

అయితే ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి కాస్త విరామం ఇచ్చిన నారా రోహిత్ ఏపీ ఎన్నికల సమయంలో ప్రతినిధి 2 సినిమా( Prathinidhi 2 ) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. """/" / ఇకపోతే తాజాగా ఈయన సుందరకాండ( Sundarakanda ) అనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.

  అయితే తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేశారు.ఈ టీజర్ చూస్తుంటే ఈ సినిమా చాలా సరదాగా సాగిపోతుందని తెలుస్తుంది.

ఇందులో నారా రోహిత్ లెక్చరర్ పాత్రలో నటిస్తున్నారు అయితే ఈయనకు జుట్టు మొత్తం తెల్లబడిన వయసు పైబడిన ఇంకా పెళ్లి కాదు.

ఇక ఈయన తనని పెళ్లి చేసుకునే వారికి 5 కండిషన్లను పెడతారు ఆ కండిషన్స్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.

"""/" / ఇక ఈ సినిమాలు ఎన్ని సంబంధాలు చూసిన ఆయనకు పెళ్లి కాకపోవడంతో పురోహితుడు మీకేమైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుతారు.

వెంటనే రోహిత్ తండ్రి పాత్రలో నటించిన నరేష్( Naresh ) తనే పెద్ద సమస్య అంటూ చెప్పుకొస్తాడు.

ఇంతలోనే రఘు బాబు నీకు ఇప్పటివరకు పెళ్లి కాకపోతే పాపం అనుకున్నాను కానీ మీ పాపాల వల్లే నీకు పెళ్లి కాలేదా.

ఈ జన్మలో నీకు ఇంకా పెళ్లి అవ్వదు అంటూ చేసిన వ్యాఖ్యలు సరదాగా అనిపించాయి.

ఇక ఈ సినిమా టీజర్ చూస్తే కనుక రోహిత్ ఎంత వినోదాత్మకంగా కొనసాగే సినిమాలో నటించబోతున్నారని తెలుస్తోంది.

ఇక మూడు రోజులే.. అలాంటివారు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాల్సిందే..