నాన్నా మీరో ఫైటర్.. ఎన్నో త్యాగాలు చేశారు.. నారా రోహిత్ ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
తాజాగా అనగా శనివారం రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు( CM Chandrababu Naidu ) సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు( Nara Ramurthy Naidu ) కన్నుమూసిన విషయం అందరికీ తెలిసిందే.
ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ నాయకులు పలువురు సినీ ప్రముఖులు సైతం ఆయనకు నివాళులు అర్పించారు.
తాజాగా రామ్మూర్తి నాయుడు తనయుడు అయిన సినీ నటుడు హీరో నారా రోహిత్( Nara Rohit ) ఆయన గురించి స్పందిస్తూ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఎమోషనల్ పోస్ట్ ని రాసుకొచ్చారు.
"""/" /
మీరొక ఫైటర్ నాన్నా.మా కోసం ఎన్నో త్యాగాలు చేశారు’.
నాన్నా.నాకు ప్రేమించడం, జీవితాన్ని గెలవడం నేర్పించారు.
ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండటానికి మీరే కారణం.ప్రజలను ప్రేమించడంతో పాటు, మంచి కోసం పోరాడాలని చెప్పారు.
మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నా అవి మా దరి చేరకుండా పెంచారు.
నాన్నా.మీతో జీవితాంతం మరచిపోలేని ఎన్నో జ్ఞాపకాలు మాకు ఉన్నాయి.
నాకు ఏం చెప్పాలో తోచడం లేదు.బై నాన్నా అంటూ నారా రోహిత్ ఒక ఎమోషనల్ పోస్ట్ ని తన ఖాతాలో షేర్ చేసారు.
"""/" /
అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నారా రోహిత్ కు ధైర్యం చెబుతూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.
అయితే తాజాగా రామ్మూర్తి నాయుడు అనారోగ్యం మరింత క్షీణించడంతో అయినను హైదరాబాదులోని హాస్పిటల్ లో చేర్పించారు.
కానీ పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు.ఆయన పార్థివదేహాన్ని ఆదివారం ఉదయం బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు.
స్వస్థలం నారావారి పల్లెలో నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
హెయిర్ వాష్ కు ముందు ఈ చిట్కాను పాటిస్తే చుండ్రు అన్న మాటే అనరు!