మొదటి సినిమా దర్శకుడుతో పీరియాడికల్ వార్ మూవీ ప్లాన్ చేస్తున్న నారా రోహిత్

రెగ్యులర్ హీరోలకి భిన్నంగా కెరియర్ ఆరంభం నుంచి భిన్నమైన కథలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న హీరోల జాబితాలో ముందు వరుసలో వినిపించే పేరు నారా రోహిత్.

నారా చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన కూడా ఈ కుర్ర హీరోకి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏ విధంగాను ఉపయోగపడలేదు కొత్త దర్శకులకి అవకాశం కల్పిస్తూ, కొత్త కథలని తెరపై ఆవిష్కరించడానికి నారా రోహిత్ ఎప్పుడు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు.

ఆయన సినిమాలు సక్సెస్ రేట్ తక్కువగానే ఉన్న ఎక్కువ విభిన్న జోనర్ లలో సినిమాలు చేసిన హీరోగా మాత్రం రోహిత్ తన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.

ప్రస్తుతం ఈ కుర్ర హీరో చాలా గ్యాప్ తీసుకొని త్వరలో ఒక పీరియాడికల్ కాన్సెప్ట్ తో రావడానికి రెడీ అవుతున్నాడు.

తన మొదటి చిత్రమైన బాణం దర్శకుడు చైతన్య దంతులూరి దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతుంది.

దర్శకుడు చెప్పిన   1971 కాలంలో వార్ నేపథ్యంలో సాగే ఒక పీరియాడికల్ స్టొరీని నారా రోహిత్ ఎప్పుడో లాక్ చేసి ఉంచాడు.

ఈ సినిమా అతని మార్కెట్ కి మించి బడ్జెట్ పెట్టాల్సి ఉండటంతో దానిపై ఇంతకాలం నుంచి వర్క్ చేస్తున్నారు.

    స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందని కరోనా పరిస్థితులు సెట్ అయ్యాక ఈ సినిమాని అఫీషియల్ గా ఎనౌన్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా కోసం నారా రోహిత్ వర్క్ అవుట్స్ చేసి పూర్తి స్లిమ్ లుక్ లోకి మారిపోయాడని తెలుస్తుంది.

మంచి టాలెంటెడ్ దర్శకుడుగా పేరున్న చైతన్య దంతులూరి ఈ సినిమాతో ఎలా అయిన కమర్షియల్ హిట్ కొట్టాలనే కసితో వర్క్ చేస్తున్నట్లు సమాచారం.

ఏంటి భయ్యా కారును ఇప్పుడు ఇలా కూడా తయారు చేస్తున్నారా.. వీడియో వైరల్..