అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కేసులు ఎత్తేస్తాం నారా లోకేష్ సంచలన హామీ..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) "యువ‌గ‌ళం" పాదయాత్ర( Yuvagalam ) ప్రస్తుతం జంగారెడ్డిగూడెంలో జరుగుతూ ఉంది.

ఈ క్రమంలో పాదయాత్ర మొదలుపెట్టి నేటికి 200 రోజులు కావడంతో పాటు 2700 కిలోమీటర్లు పూర్తి చేసుకోవడంతో కొయ్యలగూడెం మండలం సీతంపేట శివారులో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఇదే సమయంలో 200 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో లోకేష్ తల్లి నారా భువనేశ్వరి.

( Nara Bhuvaneshwari ) పాదయాత్రలో పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ( TDP ) అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీ ప్రభుత్వం టీడీపీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.

ప్రజా సమస్యలపై చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తుందని అన్నారు.

మహిళా ఆర్థిక స్వలంబన ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పుకొచ్చారు.ప్రజల దీవెనలతో రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో కచ్చితంగా అధికారంలోకి వస్తామని పేర్కొన్నారు.

జగన్ రాక్షస పాలనను పారదోలి రామరాజ్యం తీసుకురావడానికి చంద్రబాబు( Chandrababu Naidu ) ఆధ్వర్యంలో తామంత కష్టపడి పనిచేస్తున్నట్లు లోకేష్ వ్యాఖ్యానించారు.

పాదయాత్ర మొదలుపెట్టి నేటికి 200 రోజులు కంప్లీట్ కావడంతో నారా లోకేష్ నీ అభినందించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నాయకులు, అభిమానులు ప్రజలు తరలివచ్చి పాదయాత్రలో పాల్గొన్నారు.

200 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా కొయ్యలగూడెంలో గిరిజనులతో యువ నేత ముఖాముఖి సమావేశం నిర్వహించి వారి కష్టాలు తెలుసుకున్నారు.

మోక్షజ్ఞ లేటెస్ట్ లుక్ సింప్లీ సూపర్బ్.. బాలయ్యను మించిన హీరో అవుతాడా?