మాజీ మంత్రి అనిల్ వ్యాఖ్యలకు నారా లోకేశ్ కౌంటర్

ఏపీలో అధికార, విపక్ష నేతల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.ఇందులో భాగంగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేత నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు.

అభివృద్ధిపై చర్చకు తాను రెడీ అన్న లోకేశ్ ఏం అభివృద్ధి చేశారో అనిల్ చెప్పాలని డిమాండ్ చేశారు.

అనిల్ కుమార్ కు నెల్లూరు సిటీ టికెట్ ఉందా .? లేదా.

? జగన్ చెప్పారా.? అని ప్రశ్నించారు.

నెల్లూరు సిటీలోనే అనిల్ పోటీ చేస్తే కచ్చితంగా ఓడిస్తామని పేర్కొన్నారు.కార్పొరేట్ సీట్లు కూడా అనిల్ అమ్ముకున్నారని ఆరోపించారు.

అనిల్ అవినీతికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా బయటపెడతామన్నారు.కుప్పంలో మొదటిసారిగా రెండు ఎకరాల భూమి కొన్నామని తెలిపారు.

తాము అవినీతి చేసి ఉంటే బయట ఉండేవాళ్లమా అని ప్రశ్నించారు.

పుష్ప 2 విషయం లో ఏదో తేడా కొడుతున్నట్టుగా ఉంది…