ఢిల్లీకి నారా లోకేశ్..!!
TeluguStop.com
టీడీపీ నేత నారా లోకేశ్ ఢిల్లీకి పయనం అయ్యారు.ఈ మేరకు హస్తినకు వెళ్లనున్న ఆయన న్యాయ నిపుణులతో చర్చలు జరపనున్నారు.
అయితే టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
చంద్రబాబుపై వరుస కేసులను సీఐడీ అధికారులు నమోదు చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో న్యాయపరమైన అంశాలపై నిపుణులతో లోకేశ్ చర్చించనున్నారని తెలుస్తోంది.
కాగా స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.
వైరల్ వీడియో: అర్థరాత్రి పోలీస్ స్టేషన్లో మహిళా హోంగార్డుతో అసభ్యకరంగా ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్