పాస్టర్ కిషోర్ కి అండగా నేను ఉంటాను అంటున్న నారా లోకేష్
TeluguStop.com
టిడిపి ఎంఎల్‌సి నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలు చేశాడు.
మంగళగిరి నియోజక వర్గం కు చెందిన పెనుమాక గ్రామంలోని పెనియెలూ ప్రార్థన మందిర నిర్వహకుడు కిషోర్ పై వైసీపీ రౌడీలు దాడి చెయ్యడాని ఆయన తీవ్రంగా ఖండించాడు.
తక్షణమే వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాడు.30 ఏళ్లుగా దేవుడి మార్గంలో నడుస్తూ సేవలు అందిస్తున్న ఆయనపై దాడి చెయ్యడం అనేది బాదకరమైన విషయం.
ఆయనకు అండగా టిడిపి ఉంటుందని తెలిపాడు.కేసు నీరుగార్చే ప్రయత్నాలు ఆపి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.
కిషోర్ గారి న్యాయ పోరాటానికి నేను అండగా ఉంటాను అని అన్నాడు.అదే కిషోర్ మాట్లాడినా వీడియో ను ట్విట్టర్ లో నారా లోకేశ్ పోస్ట్ చేశాడు.
ఈ ఘటన ఈ నెల 7 వ తారీఖు రాత్రి జరిగింది బాగా తాగేసిన నలుగురు యువకులు ఆయనపై దాడి చేశారు.
ఆయన కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెల్లుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఆయన ఆ రోజు నుండి ఈరోజు వరకు న్యాయపోరాటం చేస్తున్నాడు.
కొడుకు ఆరోగ్యం కోసం తల్లి ఆరాటం.. స్వామి సేవలో డిప్యూటీ సీఎం సతీమణి.!