లోకేశ్.. ఇంకా మారాల్సిందే !

ఏపీ రాజకీయాల్లో నారా లోకేశ్( Nara Lokesh ) కు సంబంధించిన చర్చ ఎప్పుడు కూడా హాట్ టాపిక్ గానే ఉంటుంది.

చంద్రబాబు తనయుడిగా లోకేశ్ రాజకీయ ఆరంగేట్రం చేసినప్పటికీ తండ్రిలాగా రాజకీయాల్లో తన మార్క్ చూపించడంలో లోకేశ్ ఇంకా తడబడుతూనే ఉన్నారు.

మొదట్లో లోకేశ్ మాట విధానంపై మరియు ఆయన బాడీ లాంగ్వేజ్ పై వచ్చిన విమర్శలు అన్నీ ఇన్ని కావు.

ఫలితంగా లేకేష్ ఏది మాట్లాడినా కూడా వైసీపీ( YCP ) లైట్ తీసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.

అసలు లోకేశ్ ను తమ ప్రత్యర్థిగా భావించడానికి కూడా వైసీపీ నేతలు చిన్నచూపు వహిస్తుండేవారు.

"""/" / అయితే ఇదంతా గతం.ప్రస్తుతం పరిస్థితి అలా లేదు.

తనపై వచ్చిన విమర్శలనే బలంగా తీసుకొని తనను తాను మలుచుకుంటున్నారు నారా లోకేశ్.

గతంలో తన శరీరంపై గుప్పించిన విమర్శలను సన్నబడి అంతే స్థాయిలో తిప్పికొట్టారు.ఇక తన మాట విధానంపై వచ్చిన విమర్శలను ఇప్పుడు పదునైన మాటలతో అంతే స్థాయిలో విరుచుకుపడుతున్నారు.

దాంతో నారా లోకేశ్ లో వచ్చిన మార్పుకు టీడీపీ శ్రేణుల సంబరాలు అన్నీ ఇన్ని కావు.

ఇక పాదయాత్రలో తనదైన మార్క్ చూపిస్తూ ప్రజల్లో దూసుకుపోతున్నారు లోకేశ్.ఈ పాదయాత్ర ఇప్పటికే 600 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకుంది.

ఈ పాదయాత్ర ద్వారా లోకేశ్ మరింత రాటుదేలుతున్నారని తెలుగు తమ్ములు చెబుతున్నారు. """/" / అయితే ప్రత్యర్థుల నోళ్ళు మూయించడానికి లోకేశ్ ఇంకా మార్చుకోవాల్సింది చాలానే ఉందనేది కొందరి అభిప్రాయం.

ముఖ్యంగా పలికే పదాల విషయంలో స్పష్టత లేకపోవడం లోకేశ్ కు మైనసే.చంద్రబాబు( Chandrababu Naidu ) ఏడు పదుల వయసులో కూడా స్పష్టమైన పదాలు పలుకుతూ ప్రజలను ఆకర్షిస్తున్నారు.

కానీ లోకేశ్ మాత్రం తన మాటలతో ప్రజలను ఆకర్షించడంలో ఇంకా విఫలం అవుతూనే ఉన్నారు.

ఇక ప్రస్తుతం పాదయాత్రలో జగన్ సర్కార్ పై విమర్శలు చేయడానికే అధిక సమయం వేచిస్తునన్నారు లోకేశ్.

అలా కాకుండా తాము అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నామనే దానిపై ప్రజల్లో దూకుడుగా వ్యవహరిస్తే ప్రజల దృష్టి లోకేశ్ పై పడుతుంది.

మరి ఇప్పటికే చాలా మారిన చినబాబు.ఇంకా తనలోని లోపాలను సరిదిద్దుకుంటే లోకేశ్ కు తిరుగుండదనేది కొందరి అభిప్రాయం.

చిరంజీవి బ్లాక్ బస్టర్ సినిమాలకు సీక్వెల్స్… ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన అశ్విని దత్!