లోకేష్ కి ఇది పరీక్షా సమయమేనా ?

ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ప్రత్యక్షంగా గెలవకపోయినా మంత్రి పదవులు దక్కించుకోగలిగారంటే తన తండ్రి పార్టీ అధినేత అవ్వడం వల్లే అన్నది అందరికీ తెలిసిన విషయమే .

తన శరీరాకృతి లోనూ ,మాటతీరులోనూ, పరిపాలనలోనూ లోకేష్ అనేక అనేక తీవ్రమైన విమర్శలు ప్రతిపక్షాల నుంచి ఎదుర్కొన్నారు .

అయితే నవ్విన నావ చేనే పండుతుందన్నట్లుగా తనపై వచ్చిన విమర్శలను సీరియస్గా తీసుకున్న లోకేష్( Nara Lokesh ) తన శరీరాకృతి నుంచి మాట తీరు వరకు తనను తాను చెక్కుకున్న ఒక శిల్పిలా కష్టపడ్డారు.

అయితే ఒక పార్టీని నడపాల్సిన సమర్ధత తనకు ఉంది అని లోకేష్ కి నిరూపించు కోవాల్సిన అవసరం ఇంతవరకూ రాలేదు .

"""/"/ ప్రజాభిమానాన్ని క్రమంగా పెంచుకునేందుకు తన పాదయాత్రను ఒక మార్గంగా ఎంచుకున్న లోకేష్ రాజకీయాలను( Lokesh Politics ) పూర్తిస్థాయి స్థాయిలో అవపో సన పడుతున్నారు.

తన బలాన్ని ,తన అధికారాన్ని ,పార్టీపై తన పట్టును కుమారుడికి రెడ్ కార్పెట్ గా పరిచిన చంద్రబాబు లోకేష్ ను అన్ని విధాలుగా సమర్ధుడుగా తీర్చిదిద్దే ప్రయత్నాలలో ఉన్నారు.

అయితే అనివార్య పరిస్థితి లో చంద్రబాబు( Chandrababu Arrest ) ఇప్పుడు హఠాత్తుగా జైలు పాలు అవ్వడంతో లోకేష్ తాను నేర్చుకున్న విద్యలను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది.

"""/"/ పార్టీ( Telugu Desam Party )పై తన పట్టును నిలుపుకుంటూ కార్యకర్తలను, నాయకులని సమన్వయం చేసుకుంటూ ప్రజా స్పందన ని తమ పార్టీకి అనుకూలంగా మలచడంలో లోకేష్ తీసుకునే నిర్ణయాలు ఎంత సమర్థవంతంగా ఉంటాయో చూడాలి.

వెనక తండ్రి మద్దతు, డైరెక్షన్ లేకపోయినా కూడా తాను నాయకత్వ లక్షణాలను చూపించగలనని పార్టీకి తాను అసలైన వారసుడనని లోకేష్ చూపించుకోవలసిన సమయం ఆసన్నమైంది.

ఒకవైపు పార్టీ వ్యవహారాలను చక్కబెడుతూనే మరోవైపు తన యాత్రను సమన్వయం చేసుకుంటూ లోకేష్ ఎంత మేరకు ముందుకెళ్తాడు అన్న దాన్నిబట్టి ఆయన రాజకీయ భవిష్యత్తు( TDP ) ఆధారపడి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు .

మరి తెలుగు “దేశం క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన సమర్థతను లోకేష్ నిరూపించగలడో లేదో వేచి చూడాలి .

ఇలా చేస్తే ఎలా యంగ్ టైగర్ .. ఆ టార్గెట్ ను అందుకోవడం సాధ్యమేనా?