ఎమ్మెల్యే కేతిరెడ్డి పై నారా లోకేష్ సీరియస్ పోస్ట్..!!

టీడీపీ యువనేత నారా లోకేష్( Nara Lokesh ) పాదయాత్ర ప్రస్తుతం అనంతపురం జిల్లాలో సాగుతోంది.

ఈ పాదయాత్రలో వైసిపి నాయకులు చేస్తున్న అక్రమాలపై లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.

తాజాగా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి( MLA Kethireddy Venkatramireddy ) వ్యవహరిస్తున్న తీరుపై లోకేష్ సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ పెట్టారు.

చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు అనే హెడ్డింగ్ పెట్టి."గుడ్ మార్నింగ్ ధర్మవరం( Good Morning Dharmavaram ) పేరుతో నియోజకవర్గంలో తిరుగుతున్న ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఉద్యోగులకు నిజాయితీగా ఉండాలంటూ నీతులు చెబుతారు.

అయితే తాను మాత్రం గుట్టలను దోచేస్తాడు.ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం సమీపంలోని ఎర్రగుట్టను ఆక్రమించి విలాసవంతమైన ఫామ్ హౌస్ కట్టుకున్నారు.

902, 909 సర్వే నెంబర్లలోని 20 ఎకరాలను అక్రమించాడు.ఇది మరో రుషికొండ అని, ఎమ్మెల్యే గారి విలాస కార్యక్రమాలకు అడ్డా అని లోకల్ టాక్" అని లోకేష్ పోస్ట్ చేయడం జరిగింది.

"""/" / పాదయాత్రలో లోకేష్ తో పాటు పరిటాల శ్రీరామ్ కూడా పాల్గొన్నారు.

చెరువు కబ్జా చేసి అక్రమంగా అక్కడ విలాసవంతమైన ఫామ్ హౌస్ కేతిరెడ్డి కట్టుకున్నట్లు కొండను తొలిచి రేసింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకున్నట్లు.

లోకేష్ దృష్టికి పరిటాల శ్రీరామ్ తీసుకొచ్చి.కొండను తొలిచిన ప్రాంతం మొత్తం చూపించి వివరించారు.

ఇక ఇదే సమయంలో ఆక్రమించి విలాసమంతమైన ఫామ్ హౌస్ కట్టిన ప్రాంతం దగ్గర నారా లోకేష్ సెల్ఫీ దిగి కేతిరెడ్డికి ఛాలెంజ్ చేశారు.

భారతీయుడు2 సినిమా చూస్తున్నంత సేపు కన్నీళ్లు ఆపుకోలేకపోయా.. భోలేషావలి కామెంట్స్ వైరల్!