భీమవరం వైసీపీ ఎమ్మెల్యే పై లోకేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) యువగళం పాదయాత్ర ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో( Bhimavaram ) సాగుతుంది.

ఈ క్రమంలో భీమవరంలో రోడ్ల సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు.టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు బాగు చేస్తామని స్పష్టం చేశారు.

జగన్ ప్రభుత్వం( CM Jagan ) ఇప్పటి వరకు మూడుసార్లు బస్సు చార్జీలు ఇంకా తొమ్మిది సార్లు కరెంటు చార్జీలు పెంచినట్లు విమర్శించారు.

ఈ పాదయాత్రలో ఆకివీడు పంచాయతీలోని సమస్యలు ఇంకా ఉండీ సెంటర్ లో వంతెన నిర్మాణ అవసరాన్ని తెలుసుకున్న లోకేష్ .

అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.భీమవరంలో డంపింగ్ యార్డ్ తో పాటు రింగ్ రోడ్డు ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా ఏర్పాటు చేస్తామని అన్నారు.

"""/" / ఇదే సమయంలో కిడ్నీ బాధితులకు డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో 1500 కోట్ల రూపాయలతో భీమవరాన్ని అభివృద్ధి చేసినట్లు స్పష్టం చేశారు.

స్థానిక వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్( MLA Grandhi Srinivas ) భీమవరానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అని విమర్శించారు.

ఆయన నియోజకవర్గంలో చేస్తున్న అక్రమాలపై సొంత పార్టీ కార్యకర్తలే ఫిర్యాదు చేస్తున్నట్లు ఆరోపించారు.

సీఎం జగన్ ఇసుక దోచుకుంటుంటే.ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భూ బకాసురుడు అని ధ్వజమెత్తారు.

జగనన్న ఇళ్ల పేరుతో తక్కువ ధరకే భూములు కొని ఎక్కువ వరకు అమ్ముకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో పేదలకు ఒక ఇల్లు కట్టలేదు మరోపక్క జగన్ పెద్ద ప్యాలస్ లో ఉంటున్నారు అంటూ లోకేష్ మండిపడ్డారు.

రాజ్ తరుణ్ నాకు అబార్షన్ చేయించాడు.. లావణ్య సంచలన వ్యాఖ్యలు వైరల్!