టీడీపీ మంగళగిరి విస్తృతస్థాయి సమావేశంలో నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) బుధవారం సాయంత్రం మంగళగిరి( Mangalagiri ) పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సమావేశానికి విచ్చేసిన పార్టీ క్యాడర్ కి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

పాదయాత్ర చేస్తున్న సమయంలో చాలామంది సమస్యలు చెప్పుకోవడానికి నా దగ్గరికి వచ్చేవాళ్ళు.అలాంటి సందర్భాలలో మంగళగిరి నియోజకవర్గం గుర్తుచేది అని వ్యాఖ్యానించారు.

తెలుగుదేశం పార్టీ( TDP ) హయాంలో ప్రజలకు చేసిన మంచిని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది.

అయితే 2019 ఎన్నికల సమయంలో ఓడిపోయినప్పుడు తనని చాలామంది ఎగతాళి చేశారు.అలాంటి సమయంలో మళ్లీ మంగళగిరి నుంచి పోటీ చేయాలనుకుంటున్నావా అంటూ చంద్రబాబు గారు నన్ను ప్రశ్నించారు.

ఆ సమయంలో మంగళగిరి ప్రజలను నాలో కసి పెంచారు.తగ్గేదే లేదని చెప్పాను.

అయితే ఈ ఐదు సంవత్సరాలలో మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ ప్రభుత్వం( YCP ) చేసింది గుండు సున్నా.

రెండుసార్లు వైసీపీని గెలిపించారు.మంగళగిరి నియోజకవర్గం విషయంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరించింది.

ఆళ్ళ రామకృష్ణారెడ్డిని( Alla Ramakrishna Reddy ) గెలిపిస్తే మంత్రిని చేస్తానని చెప్పిన జగన్( Jagan ) ఆ మాట తప్పరు.

మంగళగిరి నియోజకవర్గానికి ప్రత్యేక నిధులు కేటాయిస్తానని చెప్పి.నయా పైసా కూడా కేటాయించలేదు.

"""/" / ఈ క్రమంలో మంగళగిరిని నా కడుపులో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటా.

అంటూ లోకేష్ ఈ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్నికలలో ఓడిపోయిన కష్ట కాలంలో నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడ్డ.

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్( Master Plan ) రూపొందించా.నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తానని పలు హామీలు ఇవ్వడం జరిగింది.

ఇదే సమయంలో "బాబు ష్యురిటీ  భవిష్యత్తు గ్యారెంటీ" పేరిట విడుదల చేసిన సూపర్ సిక్స్ పథకాలు ప్రజలలోకి బలంగా తీసుకెళ్లాలని నేతలకు లోకేష్ సూచించారు.

"""/" / ప్రచారం విషయంలో ఎక్కడ వెనకడుగు వేయొద్దు గ్రూపు రాజకీయాలు చేయొద్దు.

ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను.ఇప్పుడున్న పరిస్థితులలో ఇతర పార్టీల నుంచి ఎవరైనా వచ్చినా గాని ప్రజెంట్ కేడర్ ని కాపాడుకునే బాధ్యత నాది.

పార్టీ కోసం ఎవరెవరు ఎలా కష్టపడ్డారో నాకు అంతా తెలుసు.ఎన్నికల సమయంలో నాయకులంతా ప్రజల మధ్య ఉండాలి.

వచ్చే ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలవాలి అని మంగళగిరి పార్టీ సమావేశంలో లోకేష్ సంచలన స్పీచ్ ఇచ్చారు.

రజనీకాంత్ పాటకి అదిరిపోయే డ్యాన్స్ చేసిన చిలుక.. వీడియో వైరల్..