Nara Lokesh : నేటి నుంచి లోకేష్ ఎన్నికల ‘ శంఖారావం ‘ 

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు.

రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రమంతట పర్యటించేందుకు లోకేష్ ప్లాన్ చేసుకుంటున్నారు.

ఈ మేరకు ఇచ్చాపురం నుంచి ఎన్నికల శంఖారావాన్ని లోకేష్ నేటి నుంచి ప్రారంభించనున్నారు.

తొలి విడతలో ఉత్తరాంధ్రలోని 31 నియోజకవర్గాల్లోనూ పర్యటన చేపట్టే విధంగా లోకేష్ ప్లాన్ చేసుకుంటున్నారు.

ముఖ్యంగా యువగళం పాదయాత్ర జరగని నియోజకవర్గాల్లో శంఖారావం పేరుతో ఆయన ఆదివారం నుంచి పర్యటిస్తారు.

నిన్న రాత్రి 10.45 గంటలకు ఇచ్చాపురం చేరుకున్న లోకేష్ కు ఎమ్మెల్యే బెందాళం అశోక్( Bendalam Ashok ) స్థానిక టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు .

రాజావారి గ్రౌండ్స్ లో ఈరోజు ఉదయం శంఖారావం ప్రారంభ సభలో ప్రసంగిస్తారు.అనంతరం పార్టీ నేతలు, కార్యకర్తలతో ఎన్నికల వ్యూహాలపై ముఖాముఖి నిర్వహిస్తారు.

"""/" / ఈ సందర్భంగా వారితో లోకేష్ ప్రతిజ్ఞ చేయించి సూపర్ సిక్స్ కిట్లు అందజేయనున్నారు.

సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం నిర్వహించడంతో పాటు , ' బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ ',  ' మన టీడీపీ యాప్ ' లో ప్రతిభ కనబరిచిన కార్యకర్తలను అభినందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

అలాగే పార్టీలో చేరేవారిని ఆహ్వానిస్తారు.దాదాపు అన్ని నియోజకవర్గాలను ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించేందుకు లోకేష్ ప్లాన్ చేసుకుంటున్నారు.

మధ్యాహ్నం 12.30 గంటలకు పలాస, సాయంత్రం నాలుగు గంటలకు టెక్కిలి చేరుకుంటారు.

రాత్రికి నరసన్నపేట పరిధిలోని జమ్ము గ్రామ శివారు లో లోకేష్ బస చేయనున్నారు.

"""/" / 12 న నరసన్నపేట, శ్రీకాకుళం ,ఆముదాలవలస, 13న పాతపట్నం, పాలకొండ, కురుపాం నియోజకవర్గల్లో లోకేష్ పర్యటన సాగనుంది.

తొలి విడతలో 11 రోజుల పాటు ఉత్తరాంధ్ర( Uttarandhra )లోని 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు.

రోజుకు మూడు నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో పరిస్థితులను లోకేష్ సమీక్షిస్తారు.పూర్తిగా పార్టీ శ్రేణులను ఎన్నికల మూడ్ లోకి తీసుకెళ్లడం తో పాటు, జనాల్లోనూ పార్టీకి ఆదరణ పెంచేలా వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను హైలెట్ చేసే ఆలోచనతో లోకేష్ ఉన్నారు.

బిర్యానీ లవర్స్.. కొత్త పార్లే-జి బిస్కెట్ల బిర్యానీ వచ్చేసింది.. ట్రై చేసారా?