లోకేశ్, బ్రాహ్మణిల మ్యారేజ్ లవ్ మ్యారేజ్.. షాకింగ్ విషయాలు రివీల్!
TeluguStop.com
బాలకృష్ణ పెద్ద కూతురు నారా బ్రాహ్మణి గురించి ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
నారా బ్రాహ్మణి సినీ, మీడియా రంగాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రేక్షకుల్లో ఆమెకు మంచి గుర్తింపు ఉంది.
తాజాగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన అన్ స్టాపబుల్ షో ద్వారా లోకేశ్ బ్రాహ్మణిల మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని వెల్లడైంది.
బ్రాహ్మణిని పెళ్లి గురించి అడిగితే చదువుకోవాలని ఇప్పుడే పెళ్లి ఇష్టం లేదని చెప్పిందని చంద్రబాబు వెల్లడించారు.
ఆ సమయంలో ఏం చెప్పి ఒప్పించావు అని బాలయ్య లోకేశ్ ను అడగగా ఇద్దరం కలిసి చదువుకుందాం అని చెప్పి ఒప్పించానని లోకేశ్ చెప్పగా నీకు కూడా మేనమామ పోలికలు వచ్చాయని బాలయ్య చెప్పారు.
ఒక విధంగా లోకేశ్ బ్రాహ్మణిల మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అని బాలయ్య కామెంట్లు చేశారు.
లోకేశ్ బ్రాహ్మణిల జోడీ బాగుంటుందనే సంగతి తెలిసిందే.ఈ జోడీకి చాలామంది అభిమానులు ఉన్నారు.
లోకేశ్ ను హీరో చేయాలని అప్పట్లో చంద్రబాబు భావించారు. """/"/లోకేశ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఉంటే సక్సెస్ అయ్యేవారని కొంతమంది భావిస్తుంటే ఫెయిల్ అయ్యేవారని మరి కొందరు అనుకుంటున్నారు.
రాజకీయాల్లో లోకేశ్ ఇప్పటివరకు ఆశించిన రేంజ్ లో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.
2024 ఎన్నికల్లో లోకేశ్ కచ్చితంగా సక్సెస్ సాధిస్తారని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. """/"/
లోకేశ్ కొన్ని విషయాలలో మారితే ఆయన కచ్చితంగా రాజకీయాలలో సంచలన విజయాలను సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
గతంతో పోల్చి చూస్తే రాజకీయాలకు సంబంధించి లోకేశ్ మారారని కామెంట్లు వినిపిస్తున్నాయి.మంగళగిరిలో లోకేశ్ కు అనుకూల ఫలితాలు వస్తాయో రావో చూడాల్సి ఉంది.