చినబాబు రెడీ ! పాదయాత్రతో వేడి ?

టిడిపి, బీజేపీ, జనసేన ,వైసిపి ఇలా అన్ని పార్టీలు రంగంలోకి దిగి పోయాయి.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో,  వాడివేడిగా ప్రచారం నిర్వహిస్తూ,  ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నాయి.

వైసిపి సిట్టింగ్ స్థానం కావడంతో,  మళ్లీ గెలుపు తమదేననే ధీమాలో వైసీపీ ఉండగా, జనసేన, బిజెపి కూటమి సైతం ఇక్కడ గెలుపు తమదేనని నమ్మకంగా ఉంది.

అయితే టిడిపి ఈ రేసులో వెనకబడింది అనే లెక్కలు బయటికి వస్తుండటంతో కంగారులో ఉన్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు, ఇప్పుడు లోకేష్ ను రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యారు.

ఈ మేరకు లోకేష్ తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటనలు చేయడంతోపాటు, తిరుపతి పాదయాత్ర నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ మేరకు పార్టీ అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసింది.ఈరోజు తిరుపతిలో ఎన్నికల ప్రచారంలో లోకేష్ పాల్గొనబోతున్నారు .

తెలుగు యువత చైతన్య యాత్రపేరుతో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.  సాయంత్రం నాలుగు గంటలకు తిరుపతిలోని జ్యోతిరావు ఫూలే విగ్రహం వద్ద యాత్ర ప్రారంభించి అనంతరం భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు టిడిపి ప్లాన్ చేసుకుంది.

ఈ సభలో లోకేష్ ప్రధాన ఆకర్షణగా ఉండడంతో పాటు , వైసీపీ పై పూర్తి స్థాయిలో టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తూ, లోకేష్ ప్రసంగం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో లోకేష్ పర్యటించబోతున్నారు. """/"/ శ్రీకాళహస్తి, సత్యవేడు, సూళ్లూరుపేట , వెంకటగిరి,  సర్వేపల్లి, గూడూరులో లోకేష్ పర్యటనలు సాగపోతున్నాయి.

ఇంటింట ప్రచారాలతో పాటు , అవసరమైనచోట బహిరంగ సభలు నిర్వహించేందుకు టిడిపి ప్లాన్ చేసింది.

మొత్తం తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంతో పాటు, లోకేష్ ను బలమైన నాయకుడిగా ప్రమోట్ చేసుకునేందుకు ఈ ఎన్నికలను ఉపయోగించుకునేందుకు చంద్రబాబు తగిన ప్రణాళిక రచించినట్లు అర్థం అవుతోంది.

ఇప్పటికే టీడీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా పని చేస్తూ, ఎన్నికల ప్రచారాన్ని ఊపందుకునేలా గట్టిగా కష్టపడుతోంది.

చినబాబు పాదయాత్ర తో టిడిపి లో జోష్ పెరిగితే , అది తమకు కలిసి వస్తుంది అనే అంచనా ఆ పార్టీ వేస్తోంది.

భారతీయులు లేకుండా యూఎస్ టెక్ ఇండస్ట్రీ కష్టమే : సిలికాన్ వ్యాలీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీఈవో