గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి స్పందించిన నారా లోకేష్..!!

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడికి పాల్పడటం జరిగింది.

పార్టీ కార్యాలయం ఆవరణలో ఉన్న వాహనాలకు నిప్పు అంటించడంతో పాటు.అద్దాలు మరియు ఫర్నిచర్ ధ్వంసం చేశారు.

కర్రలతో కూడా దాడులకు పాల్పడటం జరిగింది.ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ మరియు వల్లభనేని వంశీ అనుచరులు ఒకరిపై మరొకరు రాళ్లు కూడా విసురుకున్నారు.

అయితే ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు.గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.

"""/" / వైసీపీ గుండలు రెచ్చిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.పోలీసుల తీరు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ.

గన్నవరం నటోరియస్ క్రిమినల్ కి పోయేకాలం.పశ్చాతాపబడే రోజు దగ్గరపడింది.

అనీ లోకేష్ పేర్కొన్నారు.దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని.

గన్నవరం తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనలు చేస్తున్నారు.దాదాపు 50 నుండి 60 మంది వైసీపీ పార్టీ కార్యకర్తలు ఈ దాడిలో పాల్గొన్నట్లు ఆరోపిస్తున్నారు.

2030 వరకు రాజమౌళి సినిమాతో మహేష్ బిజీ.. ఇలా చేయడం జక్కన్నకు న్యాయమేనా?