అయ్యో.. అయ్యయ్యో.. టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతున్న లోకేష్

14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు రాజకీయ అపర చాణిక్యుడిగా పేరుంది.దీంతో ఆయన వారసుడు నారా లోకేష్‌కు కూడా ఎంతో కొంత రాజకీయ పరిణితి ఉంటుందని భావించడంలో తప్పు లేదు.

అయితే చంద్రబాబులో ఒక్కవంతు కూడా లోకేష్ ఎదగలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి.ఎందుకంటే లోకేష్ ప్రసంగాల్లో పస ఉండదు.

ఆయన ఏ టాపిక్ మాట్లాడుతున్నారో స్పష్టత కూడా ఉండదు.అందుకే లోకేష్ ప్రసంగంలో దొర్లే తప్పులను ఎలా ట్రోల్ చేద్దామా అంటూ వైసీపీ ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు.

లోకేష్ వల్ల చంద్రబాబు కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఒకరకంగా చంద్రబాబుకు వెన్నుదన్నుగా నిలవాల్సిన పరిస్థితుల్లో ఆయన పుత్రరత్నం దారుణ వైఫల్యాలను చవిచూస్తున్నారు.

సీఎం కుమారుడి స్థాయిలోనే కాకుండా మంత్రి పదవిని కూడా అనుభవించిన లోకేష్ చివరకు ఎమ్మెల్యేగా కూడా గెలవలేక విమర్శల పాలయ్యారు.

మరోవైపు లోకేష్ కోసం సీనియర్ నేతలను కూడా చంద్రబాబు పక్కన పెడుతున్నారు.కానీ లోకేష్‌ మాత్రం పరిపక్వత లేని రాజకీయాలు చేస్తూ తండ్రికి ఇబ్బందులు తెస్తూనే ఉన్నారు.

చినబాబు రాజకీయ వ్యూహాల వల్లే 2019లో టీడీపీ చతికిలపడిందనే కామెంట్లు కూడా వినిపించాయి.

చంద్రబాబు 60 ఏళ్ల వయసులోనూ మరోసారి టీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నారు.

విరామం లేకుండా ఏపీ మొత్తం పర్యటిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు.ఆనాడు వైఎస్ఆర్ తీసుకొచ్చిన పలు పథకాలతో ప్రజలు బాగా లబ్ధి పొందారు.

అందుకే రాజన్న రాజ్యం అంటూ వైసీపీ కూడా ప్రతి ఎన్నికల్లో ప్రచారం చేసుకుంటుంది.

అందుకే చంద్రబాబు కూడా వైఎస్ఆర్‌ను విమర్శించకుండా వైసీపీని మాత్రమే తిడుతూ ఆ పార్టీని ఇరుకున పెడుతుంటారు.

"""/"/ అయితే లోకేష్ మాత్రం తన తండ్రి చంద్రబాబుకు వ్యతిరేక దారిలో వెళ్తున్నారు.

వైఎస్ఆర్‌ను తిడుతూ నాన్న గారి రక్త చరిత్ర అంటూ లోకేష్ చేస్తున్న ట్వీట్ల కారణంగా చంద్రబాబు కష్టం వృథా అవుతోందంటూ టీడీపీ నేతలు కలవరపడుతున్నారు.

చంద్రబాబు లాజికల్‌గా వైఎస్ఆర్‌ను పొగుడుతుంటే.చినబాబు రివర్స్ ట్వీట్లు వేయడం వల్ల పార్టీ ఇబ్బందుల్లో పడుతోందని పసుపు దండు అభిప్రాయపడుతోంది.

 .

ఎన్నికల ప్రచారంలో టీ.కాంగ్రెస్.. నారాయణపేటకు సీఎం రేవంత్