లోకేశ్ ప్లాన్ మార్చాడా.. ఎందుకలా ?

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చుట్టూనే తిరుగుతున్నాయి.ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు పాలు అయిన తరువాత నుంచి ఆ పార్టీకి సంబంధించిన అన్నీ కార్యకలాపాలు హోల్డ్ లో పడ్డాయి.

ముఖ్యంగా నారా లోకేశ్( Nara Lokesh ) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది.

యువగళం పాదయాత్ర( Yuvagalam Padayatra ) కారణంగా టీడీపీకి మైలేజ్ పెరగడంతో పాటు రాజకీయాల్లో లోకేశ్ కూడా పరిణితి సాధించాడు.

మరి అలాంటి పాదయాత్ర మళ్ళీ మొదలు పెట్టె అవకాశం ఉందా లేదా అనే సందేహాలు చాలమందిలో వ్యక్తమౌతువచ్చాయి.

"""/" / చంద్రబాబు( Chandrababu ) జైల్లో ఉన్న టైమ్ లో యువగళం పాదయాత్రను నారా లోకేశ్ సతీమణి బ్రహ్మణి పునః ప్రారంభించే అవకాశం ఉందనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి.

కానీ అవేవీ జరగలేదు.ప్రస్తుతం అధినేత చంద్రబాబు బెయిల్ పై ఉండడంతో మళ్ళీ యువగళం పాదయాత్రను లోకేశ్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్లు టాక్.

అయితే ఈసారి పాదయాత్రలో కొద్దిగా మార్పులు చేసే అవకాశం ఉందట.సాధారణంగా ఈ పాదయాత్ర షెడ్యూల్ ప్రకారం శ్రీకాకులం జిల్లా ఇచ్చాపురం వరకు కొనసాగాల్సి ఉంది.

కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పాదయాత్రను విశాఖలోనే ముగించే ఆలోచనలో ఉన్నారట లోకేష్.

"""/" / గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర( Chandrababu Padayatra ) కూడా విశాఖలోనే ముగియడంతో తాను కూడా విశాఖలోనే పాదయాత్ర కు ముగింపు పలికితే మేలని లోకేష్ భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం.

ఇక ఈసారి పాదయాత్రలో జనసేన ( Janasena )నాయకులు కూడా పాల్గొనే అవకాశం ఉంది.

అలాగే ఈసారి పాదయాత్ర ప్రసంగాలలో ప్రధానంగా చంద్రబాబు అరెస్ట్ అంశాన్నే ప్రస్తావించే అవకాశం ఉంది.

ఇక పాదయాత్రను వీలైనంతా త్వరగా ముగించి మరో కొత్త కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్ళే ఆలోచనలో నారా లోకేశ్ ఉన్నారట మరి ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న టీడీపీకి నారా లోకేష్ పాదయాత్ర ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుందో చూడాలి.

రోజుకొక‌ ఉసిరికాయ తింటే ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయా..?