కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో నారా లోకేశ్ భేటీ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో టీడీపీ నేత నారా లోకేశ్ భేటీ అయ్యారు.

టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో పాటు అరెస్ట్ అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను అమిత్ షాకు వివరించారు.

ఈ క్రమంలోనే చంద్రబాబుపై కేసులు, న్యాయస్థానాల్లో కొనసాగుతున్న విచారణల గురించి లోకేశ్ వివరించారని తెలుస్తోంది.

అదేవిధంగా సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అమిత్ షా కు ఫిర్యాదు చేశారు.

చంద్రబాబును అరెస్ట్ చేసి విచారణ పేరుతో వేధిస్తున్నారని పేర్కొన్నారు.అంతేకాకుండా తన తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణిని సైతం ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు.

ఈ క్రమంలో చంద్రబాబుపై, లోకేశ్ పై ఎన్ని కేసులు పెట్టారన్న విషయాన్ని అమిత్ షా అడిగి తెలుసుకున్నారని తెలుస్తోంది.

73 ఏళ్ల వయసు ఉన్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్న అమిత్ షా ఏపీలో జరుగుతున్న పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు వెల్లడించారు.

వావ్.. ఇది కదా అసలైన రోహిత్ శర్మ.. హృదయాలను గెలుచుకున్నాడుగా