ఏపీ హైకోర్టులో నారా లోకేశ్ లంచ్ మోషన్ పిటిషన్లు

టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు.

ఒకటి ఏపీలోని ఫైబర్ నెట్ కేసులో లోకేశ్ ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు.

ఈ మేరకు లోకేశ్ పిటిషన్ పై మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ చేపట్టనుంది న్యాయస్థానం.

ఫైబర్ గ్రిడ్ తో తనకు సంబంధం లేదని, తనను అకారణంగా ఆ కేసులో ఇరికించారని పిటిషన్ లో పేర్కొన్నారు.

మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో 41 ఏ నోటీసుల్లో కొన్ని నిబంధనలను సవాల్ చేసిన లోకేశ్ పిటిషన్ దాఖలు చేశారు.

హెరిటేజ్ పుడ్స్ నుంచి తాను ఎప్పుడో బయటకు వచ్చానన్న ఆయన తానెలా సీఐడీ అడిగిన అకౌంట్ బుక్స్ తెస్తానంటూ పిటిషన్ లో అభ్యంతరం వ్యక్తం చేశారు.

కాగా ఈ పిటిషన్ పై కూడా మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టు విచారణ చేయనుంది.

బన్నీ అరెస్ట్ తర్వాత స్నేహారెడ్డి తొలి పోస్ట్ వైరల్.. ఈ పోస్ట్ లో ఏం చెప్పారంటే?