మంత్రి రోజాపై నారా లోకేశ్ విమర్శనాస్త్రాలు

వైసీపీ మంత్రి రోజాపై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

చీరలు కట్టుకుని చేతికి గాజులు వేసుకుంటే చేతగాని వాళ్లా అని ప్రశ్నించారు.తనకు రోజా చీరలు, గాజులు పంపుతానన్నారు.

పంపండి అని చెప్పారు.మా అక్కాచెల్లెళ్లకు చీరలు, గాజులు ఇచ్చి కాళ్లు మొక్కుతానని లోకేశ్ పేర్కొన్నారు.

మీ నాయకుడు జగన్ లా తల్లిని, చెల్లిని బయటకు గెంటేయలేదని విమర్శించారు.మహిళా మంత్రి అయితే ఎలా పడితే అలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు.