వెంట్రుక సవాల్ : జగన్ పై లోకేష్ ఫైర్ !

గత కొంతకాలంగా వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ .

ఈ విమర్శలు రోజురోజుకు పెరుగుతూ వస్తున్న క్రమంలో లోకేష్ తాజాగా మరోసారి జగన్ కు సవాల్ విసురుతూ అనేక విమర్శలు చేశారు.

జగన్మోహన్ రెడ్డి నా వెంట్రుక కూడా కూడా పీకలేడు అంటూ లోకేష్ సవాల్ చేశారు.

తాను ఎన్నో కుంభకోణాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు చేశారని,  కానీ ఇప్పటివరకు ఒక్క ఆరోపణలు కూడా రుజువు చేయలేకపోయారు .

ఆరోపణలు చేసి ఏమి పీకలేక కోవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసులో కోర్టుకు తీసుకు వచ్చారని లోకేష్ ఫైర్ అయ్యారు.

   తనను అరెస్టు చేసేందుకు ఇప్పటివరకు 14 కేసులు పెట్టి ఏం పీకారు అంటూ లోకేష్ ధ్వజ మెత్తారు.

కావాలంటే మరో 10 కేసులు పెట్టుకోవాలని సలహా ఇచ్చారు.తప్పు చేయలేదు కాబట్టే తాను కోర్టుకు వచ్చానని జగన్ మాదిరిగా వాయిదాలు తీసుకోవటం లేదని లోకేష్ అన్నారు .

వైసీపీ పాలనలో అంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని , ప్రజలు రాళ్లతో కొట్టించుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి  తెచ్చుకుంటున్నాడు అని అన్నారు.

2016 నుంచి తనపై చేసిన అవినీతి ఆరోపణలకు తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.

టీడీపీ నాయకులతో పాటు, దళిత ప్రజల పై వైసీపీ దాడులకు దిగుతోందని మండిపడ్డారు.

  """/" / ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య అంశాన్ని ప్రస్తావించారు .

సొంత పార్టీ కార్యకర్తల పైనే వైసీపీ దాడులకు తెగ బడుతోందని, దీనికి సుబ్రహ్మణ్యం హత్యనే ఉదాహరణ అంటూ లోకేష్ చెప్పుకొచ్చారు.

ఈ హత్య వ్యవహారం నుంచి అనంత బాబును తప్పించేందుకు మృతుడు సుబ్రహ్మణ్యం కుటుంబానికి రెండు కోట్ల డబ్బు ఇస్తానని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ప్రలోభపెట్టారని లోకేష్ విమర్శించారు  .

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది..: సీఎం రేవంత్