నాన్నను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం….నారా బ్రాహ్మణి కామెంట్స్ వైరల్!
TeluguStop.com
సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ( Balakrishna ) రాజకీయాలలో కూడా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.
ఇలా ఒకవైపు సినిమా ఇండస్ట్రీలో మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో అద్భుతమైన విజయాలను అందుకుంటూ తండ్రికి తగ్గ తనయుడిగా గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక సినిమా ఇండస్ట్రీకి బాలకృష్ణ అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఈయనకు పద్మభూషణ్( Padma Bhushan ) అవార్డుతో సత్కరించిన విషయం మనకు తెలిసిందే.
ఈ విధంగా బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో ఎంతో మంది అభిమానులు అభినందనలు తెలియజేశారు.
"""/" /
ఈ క్రమంలోనే బాలకృష్ణ సోదరి నారా భువనేశ్వరి ( Nara Bhuvaneswari )సైతం తన సోదరుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో నారా నందమూరి కుటుంబాలకు ప్రత్యేకంగా పార్టీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ పార్టీకి సంబంధించిన కొన్ని వీడియోలు బయటికి వస్తున్నాయి.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా బాలకృష్ణ గురించి మాట్లాడుతూ వారి అభిప్రాయాలను అందరితో పంచుకోవాలని సూచించారు.
ఈ క్రమంలోనే నారా బ్రాహ్మణి( Nara Bramhini ) తన తండ్రి బాలకృష్ణ గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు.
"""/" /
చిన్నప్పుడు నేను తన చెల్లి తేజు ఇద్దరు కూడా నాన్నను తప్పుగా అర్థం చేసుకున్నామని ఈమె తెలియజేశారు.
నాన్న ఏ విషయం గురించి అయినా ఏది దాచుకోకుండా ఉన్నది ఉన్నట్టు బయటకు మాట్లాడేవారు.
ఇలా నాన్న మాట్లాడటంతో ఏంటి ఈయన ఇలా మాట్లాడేస్తున్నారని నాన్న గురించి తప్పుగా అర్థం చేసుకున్నాము కాని ఇప్పుడు ఆలోచిస్తే నాన్న మాట్లాడటమే సరైన విధానం అని బ్రాహ్మిని తెలిపారు.
అలా ఉండడం ఎంత కష్టమో కూడా అర్థమైంది అంటూ ఆమె చెప్పుకొచ్చింది.ఇక తన తండ్రి గ్రాఫ్ పెరగడానికి తానే కారణమని చిన్న కుమార్తె తేజస్విని చెప్పుకొచ్చింది.
ఇవే సరదాకే మాట్లాడిన అభిమానులు మాత్రం కారణంగానే బాలకృష్ణ గ్రాఫ్ పెరిగింది అంటూ భావిస్తున్నారు.