నారా భువనేశ్వరి   ‘ నిజం గెలవాలి ‘  యాత్ర 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) వ్యవహారంపై ఆ పార్టీ ప్రజాపోరాటం చేపట్టేందుకు సిద్ధమైంది.

ఇప్పటికే అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉంది .చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించే అవకాశం ఉండడంతో , తీర్పు అనుకూలంగా వచ్చినా,  వ్యతిరేకంగా వచ్చినా ప్రజాపోరాటాలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది .

ఈ మేరకు అనేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది.  ఇక చంద్రబాబు అరెస్టు వ్యవహారంపై ఆయన సతీమణి నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari )క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు , ప్రజలతో మమేకం అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

"""/" / ఈ మేరకు భువనేశ్వరి( Nara Bhuvaneshwari ) రాజకీయ యాత్రలు చేపట్టేందుకు నిర్ణయించుకున్నారు.

చంద్రబాబు అరెస్టు వ్యవహారం తర్వాత అనేకమంది టిడిపి కార్యకర్తలు,  సామాన్య ప్రజలు ఆందోళనకు గురై చనిపోయారు.

చంద్రబాబును అకారణంగా అరెస్టు చేశారని ఆవేదనతో ఎక్కువమంది మానసికంగా వేదనకు గురై చనిపోయారు .

వీరందరి కుటుంబాలను పలకరించి వారికి అండగా టిడిపి ఉంటుందని భరోసా ఇచ్చే నిమిత్తం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో , యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు.

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పుతో సంబంధం లేకుండా నిజం గెలవాలి యాత్రను నిర్వహించాలని భువనేశ్వరి నిర్ణయించుకున్నారు.

మహానాడు సందర్భంగా టిడిపి మేనిఫెస్టోను ప్రకటించింది.వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు చంద్రబాబు పర్యటన చేస్తున్న సమయంలోనే ఆయన స్కిల్ డెవలప్మెంట్ స్కాం( Skill Development Scheme ) కేసులో అరెస్ట్ చేయడంతో అది నిలిచిపోయింది.

దీంతో భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో బాధ్యతలు తీసుకుని జిల్లాల వారీగా పర్యటించాలని నిర్ణయించుకున్నారు.

"""/" / ఇక చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి కొంతకాలం విశ్రాంతి తీసుకునే అవకాశం ఉండడంతో,  చంద్రబాబు జైలు నుంచి విడుదలైన తర్వాత యువ గళం పాదయాత్రను లోకేష్( Nara Lokesh ) మళ్లీ ప్రారంభించనున్నారట.

ఇక రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో జనాలకు దగ్గరయ్యే విధంగా టిడిపి అనేక రకాల కార్యక్రమాలను రూపొందిస్తోంది.

ప్రభాస్ కి అసలైన పోటీ ఇచ్చే స్టార్ హీరోలు వీళ్లేనా..?