నేటి నుంచి నారా భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ బస్సు యాత్ర
TeluguStop.com
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిర్వహించనున్న ‘నిజం గెలవాలి’ పేరిట బస్సు యాత్ర ఇవాళ ప్రారంభంకానుంది.
ఈ మేరకు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి యాత్రను మొదలుపెట్టనున్నారు.సాయంత్రం అగరాల గ్రామంలో నిర్వహించే బహిరంగ సభకు భువనేశ్వరి హాజరుకానున్నారు.
సభ అనంతరం నిజం గెలవాలి బస్సు యాత్రను ప్రారంభించనున్నారు.యాత్రలో భాగంగా చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబ సభ్యులను నారా భువనేశ్వరి పరామర్శించనున్నారు.
దాదాపు మూడు రోజుల పాటు జరిగే ఈ బస్సు యాత్రలో స్థానికంగా ఏర్పాటు చేసే సభలు, సమావేశాల్లోనూ భువనేశ్వరి పాల్గొననున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, కుట్రపూరితంగా ఆయనను కేసులో ఇరికించారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారని తెలుస్తోంది.
ఇవాళ చంద్రగిరిలో సాగనున్న బస్సు యాత్ర రేపు తిరుపతిలో, తరువాతి రోజు శ్రీకాళహస్తిలో కొనసాగనుంది.
ఎలా గౌరవించాలో మీరు నేర్పించక్కర్లేదు.. నాగవంశీ షాకింగ్ కామెంట్స్ వైరల్!