వైసీపీకి నాని రాజీనామా .. జగన్ కు లేఖ
TeluguStop.com
ఏపీలో ఎన్నికల ఫలితాలు విడుదలైన దగ్గర నుంచి వరుసగా వైసిపికి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి.
పార్టీలో కీలక నేతలు అనుకున్న వారంతా ఒక్కొక్కరిగా రాజీనామాలు చేస్తూ వస్తున్నారు.కొంతమంది ఇతర పార్టీలోకి వెళ్ళిపోతుండగా, మరికొంతమంది ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.
ఈ వలసలకు బ్రేక్ వేసేందుకు వైసీపీ అధిష్టానం ఎన్ని చర్యలు తీసుకున్నా. పరిస్థితి మాత్రం అదుపులోకి రానట్టుగానే కనిపిస్తోంది.
మొదటి నుంచి వైసిపి లో ఉంటూ జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఏలూరు మాజీ ఎమ్మెల్యే మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి.
ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ ( నాని )( Alla Nani ) వైసీపీకి రాజీనామా చేశారు.
ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి పదవికి ,ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి ఆయన రాజీనామా చేశారు.
తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా వైసీపీ అధినేత జగన్ కు రాసిన లేఖలో నాని పేర్కొన్నారు.
"""/" /
వ్యక్తిగత కారణాలతోనే తాను ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లుగా లేఖలో పేర్కొన్నారు.
ఆళ్ళ నాని 2004, 2009లో ఏలూరు నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
తిరిగి 2019 ఎన్నికల్లో విజయం సాధించారు.జగన్( YS Jagan Mohan Reddy ) ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు.
కరోనా సమయంలోనూ కీలక బాధ్యతలను నిర్వహించారు.వాస్తవంగా ఎన్నికలకు ముందే ఆళ్ళ నాని రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించాలని భావించారు.
ఇదే విషయంపై జగన్ తోనూ చర్చించారు.అయితే ఈ ఎన్నికల వరకు పోటీ చేయాలని అప్పట్లోనే జగన్ సూచించడంతో , ఏలూరు నుంచి 2024 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య ( Radha Krishnayya Badeti )పై పోటీ చేశారు.
"""/" /
ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య 62,388 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
ఎన్నికల్లో ఓటమి దగ్గర నుంచి ఆళ్ల నాని పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
తాజాగా పార్టీ పదవులకు , పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్28, గురువారం 2024