మరోసారి తన మాస్ చూపించిన నాని.. జస్ట్ ప్రీమియర్స్ తోనే హాయ్ నాన్న రికార్డ్!
TeluguStop.com
న్యాచురల్ స్టార్ నాని (Nani) ఎప్పుడు కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తూ వారి టాలెంట్ ను ప్రోత్సహిస్తూనే ఉంటాడు.
నాని గత సినిమాతో దసరా వంటి మాస్ యాక్షన్ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే.
దసరా సినిమాతో తన మార్కెట్ ను మరింత విస్తరించుకుని పాన్ ఇండియన్ వ్యాప్తంగా సత్తా చూపించాడు.
ఈ సినిమా తర్వాత నాని ఈసారి లవ్ స్టోరీని ఎంచుకున్నాడు.నాని ప్రస్తుతం ''హాయ్ నాన్న''( Hi Nanna ) సినిమాను చేయగా ఈ సినిమా ఈ రోజు గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.
ఈ రోజు అనగా డిసెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాగా ఇప్పటికే పడిన ప్రీమియర్స్ తో ఈ సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చింది.
మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో నాని మరో హిట్ ను తన ఖాతాలో వేసుకునేలా కనిపిస్తుంది.
"""/" /
నాని అండ్ టీమ్ ముందు నుండి డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెరిగేలా చేసి ఎన్నో అంచనాల మధ్య ఈ రోజు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.
యుఎస్ లో కూడా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా ప్రీమియర్స్ తోనే( USA Premieres ) నాని తన మాస్ స్టామినా చూపించేసాడు.
జస్ట్ ప్రీమియర్స్ తోనే ఈ సినిమా 2 లక్షల 50 వేలకి పైగా డాలర్స్ ను అందుకున్నట్టు అఫిషియల్ గా డిస్టిబ్యూటర్స్ తెలిపారు.
"""/" /
ఎప్పుడు ఈయన సినిమాలకు అక్కడ మంచి స్టార్ట్ కనబర్చుతుండగా ఈసారి మరింతగా రాబట్టినట్టు తెలుస్తుంది.
మొత్తానికి నాని యుఎస్ మార్కెట్ మాస్ ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయ్యింది.కాగా ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కించగా ఇందులో బేబీ కియారా ఖన్నా( Baby Kiara Khanna ) నాని కూతురు రోల్ పోషించింది.
అలాగే నానికి జోడీగా మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) హీరోయిన్ గా నటించగా వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.
హేషమ్ అబ్దుల్ సంగీతం అందించిన ఈ సినిమా ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.
చిరంజీవి నెక్స్ట్ సినిమా డైరెక్టర్ ఎవరో తెలుసా..? కమర్షియల్ సినిమాలకే ఓటు వేస్తున్న చిరు…