”నాని 30” గ్రాండ్ లాంఛింగ్.. ఎప్పుడు.. ఎక్కడ అంటే?

న్యాచురల్ స్టార్ నాని సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా ఇష్టం.

కుటుంబ సభ్యులు అందరితో కలిసి కూర్చుని చూసే విధంగా నాని సినిమాలు ఉంటాయి.

అందుకే ఈయన సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో మంచి హిట్ అందుకుని ఆ వెంటనే అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అయితే ఈ సినిమా ఆడియెన్స్ ను మెప్పించిన కూడా కలెక్షన్స్ పరంగా మాత్రం మెప్పించలేక పోయింది అనే చెప్పాలి.

కలెక్షన్స్ విషయంలో ఈ సినిమా టీమ్ ను నిరాశ పరిచింది.అయితే ప్రెజెంట్ నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ''దసరా'' సినిమా చేస్తున్నాడు.

ఎప్పుడు లేని విధంగా పక్కా మాస్ సినిమా చేస్తున్నాడు.నాని కెరీర్ లోనే ఇలాంటి సినిమా ఇంత వరకు చేయక పోవడంతో ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

"""/"/ ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.

ఈ సినిమా మార్చి 30, 2023 లో భారీ స్థాయిలో పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

ఇక ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.

సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూట్ పూర్తి చేసి నెక్స్ట్ సినిమాను లైన్లో పెట్టాడు.

"""/"/ అందుకు లుక్ కూడా పూర్తిగా చేంజ్ చేసాడు.ఇక ఈ సినిమా గురించి అయితే తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

నూతన డైరెక్టర్ శౌర్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వైరా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు.

తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా జనవరి 31న హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో సినీ ప్రముఖుల మధ్య గ్రాండ్ గా లాంచ్ కానుందట.

ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా హీషమ్ అబుల్ సంగీతం అందించనున్నారు.