నాని తీసుకున్న నిర్ణయం కరెక్టేనా ..?

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల డైరక్షన్ లో దసరా సినిమా చేస్తున్నాడు.

ఈ మూవీ తర్వాత వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు.ఇక లేటెస్ట్ గా తనతో ఆల్రెడీ ఒక సినిమా చేసిన డైరక్టర్ మేర్లపాక గాంధీ డైరక్షన్ లో నాని సినిమా చేస్తున్నాడని టాక్.

నానితో కృష్ణార్జున యుద్ధం సినిమా చేసిన మేర్లపాక గాంధీ అతనితో మరి సినిమా లైన్ చేస్తున్నాడని తెలుస్తుంది.

అసలైతే నానితో చేసిన కృష్ణార్జున యుద్ధం మూవీ ఫ్లాప్ అయ్యింది.అయినా కూడా మేర్లపాక గాంధీ చెప్పిన కథ నచ్చడంతో నాని నెక్స్ట్ అతనితో ఫిక్స్ అయ్యాడట.

ప్రస్తుతం మేర్లపాక గాంధీ సంతోష్ శోభన్ హీరోగా లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమా చేస్తున్నాడు.

రీసెంట్ గా ఆ మూవీ నుంచి రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది.

ఆ మూవీ హిట్ పడితే నాని తో చేసిన సినిమాకు మరింత బూస్టింగ్ అని చెప్పొచ్చు.

అయితే శ్యామ్ సింగ రాయ్ హిట్ పడినా అంటే సుందరానికి అంతగా ఆకట్టుకోలేదు మరి మళ్ళీ ఎందుకు నాని ఫ్లాప్ డైరక్టర్ కి ఛాన్స్ ఇస్తున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

నాని డెసిషన్ కరెక్టా కాదా అని డిస్కషన్స్ చేస్తున్నారు.

తలనొప్పిని తరిమికొట్టే ఈ వంటింటి చిట్కాల గురించి మీకు తెలుసా?