తిరుమల శ్రీవారిని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని దర్శించుకున్నారు
TeluguStop.com
తిరుమల శ్రీవారిని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని దర్శించుకున్నారు.ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
ఆలయం వెలుపల పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం., ప్రజలు సుభిక్షంగా ఉంటారని పంచాంగ పఠనంలో పండితులు తెలిపారన్నారు.
బన్నీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్…. పుష్ప2 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!